హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Year Ender 2019 | ఆర్టీసీపై కేసీఆర్ సక్సెస్.. రాష్ట్రాన్ని కుదిపేసిన దిశ ఘటన..

Year Ender 2019 | ఆర్టీసీపై కేసీఆర్ సక్సెస్.. రాష్ట్రాన్ని కుదిపేసిన దిశ ఘటన..

తెలంగాణ సీఎం కేసీఆర్( ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్( ఫైల్ ఫోటో)

Telangana 2019 : తెలంగాణకు 2019 కొన్ని తీపి, అత్యంత చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. కాళేశ్వర ఫలాలు చేతికందగా, దిశ, ఇంటర్ బోర్డు ఫలితాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి.

తెలంగాణకు 2019 కొన్ని తీపి, అత్యంత చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. కాళేశ్వర ఫలాలు చేతికందగా, దిశ, ఇంటర్ బోర్డు ఫలితాలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. ముఖ్యంగా దిశ ఘటన యావత్తు దేశాన్ని కదిలించింది. ఇంటర్ బోర్డు ఫలితాల వెల్లడిలోనూ అవకతవకలు జరిగిన సందర్భాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఇక.. ఏడాది పొడవునా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రంలో జరిగిన సంఘటనలను ఓసారి పరిశీలిస్తే.. తొలిసారి రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కింది. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మంత్రులు అయ్యారు. గోదావరి నదిపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వర ప్రాజెక్టు జూన్ 21న అధికారికంగా ప్రారంభమైంది. ప్రాజెక్టుతో 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అయితే.. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేపట్టాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్నా ఆగిపోయింది.

ఇక, ఇంటర్ బోర్డులో పరీక్షా ఫలితాల్లో జరిగిన అవకతవకలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. 99 మార్కులు వచ్చిన విద్యార్థికి సున్నా మార్కులు వేయడం వివాదాస్పదం అయ్యింది. ఫలితాలు వెల్లడయ్యాక 23 మంది విద్యార్థులు ఆత్యహత్యకు పాల్పడ్డారు. అటు.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కొత్తసర్సాలో అటవీశాఖ అధికారిణిపై దాడి ఘటన కూడా సంచలనం రేపింది. ఇదిలా ఉండగా, యాదగిరి గుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రాన్ని, కారు బొమ్మను చెక్కడం టీఆర్‌ఎస్ సర్కారును ఇరుకున పెట్టింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వాటిని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. నరసింహస్వామి రూపురేఖలను కూడా మార్చారని అప్పట్లో వార్తలు వెల్లువెత్తాయి.

అన్నింటికంటే ముఖ్యంగా దిశ ఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. దిశపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేయడాన్ని భారతావని తీవ్రంగా ఖండించింది. నిందితులను పట్టుకుని, ఘటన జరిగిన స్థలంలోనే వారితో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేప్పుడు ఎదురు తిరగడంతో ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. ఈ ఘటన తెలంగాణకు, దేశానికి మరకగా మిగిలింది. చివరగా.. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన 52 రోజుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కువ ఛార్జీలు చెల్లించి గమ్యస్థానాలకు చేరాల్చిన పరిస్థితి వచ్చింది. మొదట్లో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. చివరికి సమ్మె విరమించడంతో వారిపై వరాల జల్లు కురిపించారు. అయితే.. సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడి.. కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున భారం పడింది.

First published:

Tags: CM KCR, Disha, Disha accused Encounter, Kaleshwaram project, Telangana News, TSRTC Strike, Yearender 2019

ఉత్తమ కథలు