Home /News /trending /

TELANGANA CM KCR VISITS MEDIGADDA HAPPY WITH GODAVARI RIVER WATER AT KALESHWARAM PROJECT BS

కాళేశ్వరం ప్రాజెక్టును చూసి సంబురపడ్డ సీఎం కేసీఆర్.. గోదారి పరవళ్లను కనులారా వీక్షించి..

సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ

సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ

CM KCR | Kaleshwaram Project | మేడిగడ్డకు చేరుకున్న ఆయన.. ఏరియల్ వ్యూ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును చూసి సంబురపడ్డారు. హెలికాప్టర్‌లో ఉన్న మిగతా వారితో సక్సెస్ అన్నట్లు సంకేతం చూపుతూ సంబురపడ్డారు.

సజీవంగా మారిన గోదావరి నదిని కనులారా వీక్షించి, పులకించేందుకు సీఎం కేసీఆర్ నది సందర్శనకు వెళ్లారు. తొలుత మేడిగడ్డకు చేరుకున్న ఆయన.. ఏరియల్ వ్యూ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును చూసి సంబురపడ్డారు. హెలికాప్టర్‌లో ఉన్న మిగతా వారితో సక్సెస్ అన్నట్లు సంకేతం చూపుతూ సంబురపడ్డారు. ప్రాజెక్టు నిర్మించినందుకు లక్షలాది ఎకరాలకు, రైతులకు ఉపయోగపడిందని సంతృప్తిపడ్డట్లు ఆయన ముఖంలో సంతోషం కనిపించింది. మొత్తం 140 కిలోమీటర్ల మేర జగిత్యాల జిల్లా ధర్మపురి వరకు సందర్శన సాగనుంది. ఎల్లంపల్లి బ్యారేజీని సందర్శించిన అనంతరం ఆయన గోలివాడ పంప్‌హౌస్ వద్ద మధ్యాహ్నం భోజనం చేయనున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్మపురికి వస్తారు. ధర్మపురిలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని 3 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ధర్మపురి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.
First published:

Tags: CM KCR, Dharmapuri S22p10, Godavari river, Kaleshwaram project

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు