ఎన్టీఆర్ కథానాయకుడు.. కేసీఆర్ మహానాయకుడు..

ఎన్టీఆర్‌ను బాగా అభిమానించే సీఎం కేసీఆర్‌కు సోషల్ మీడియాలో ఓ అరుదైన బహుమతి అందించారు కొందరు గులాబీ బాస్ అభిమానులు. ఎన్టీఆర్ బయోపిక్‌లో హైలైట్ అయిన ‘రాజర్షి’ సాంగ్‌ను జోడించి ఆయనకు గిఫ్ట్ ఇచ్చారు.

news18-telugu
Updated: October 22, 2019, 2:23 PM IST
ఎన్టీఆర్ కథానాయకుడు.. కేసీఆర్ మహానాయకుడు..
ఎన్టీఆర్ బయోపిక్ పాటపై కేసీఆర్ వీడియో
news18-telugu
Updated: October 22, 2019, 2:23 PM IST
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వీరాభిమాని. అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న కేసీఆర్.. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి తన రాజకీయ గురువు మదన్ మోహన్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 1985లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అలా రాజకీయ జీవితంలో తొలి విజయం అందుకున్నారు. అదీ.. ఎన్టీఆర్ నేతృత్వంలోనే. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి.. టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించడం, ఉద్యమాన్ని నడిపించి, తెలంగాణ సాధించడం, ఆ తర్వాత రెండు పర్యాయాలు సీఎంగా పదవి చేపట్టడం.. ఇలా కేసీఆర్ రాజకీయ జీవితం నడుస్తూ వస్తోంది. అయితే, ఎన్టీఆర్‌ను బాగా అభిమానించే కేసీఆర్‌కు సోషల్ మీడియాలో ఓ అరుదైన బహుమతి అందించారు కొందరు గులాబీ బాస్ అభిమానులు. ఎన్టీఆర్ బయోపిక్‌లో హైలైట్ అయిన ‘రాజర్షి’ సాంగ్‌ను జోడించి ఆయనకు గిఫ్ట్ ఇచ్చారు.


సీఎం కేసీఆర్ పూజ చేస్తున్న సన్నివేశంతో మొదలై.. ఉద్యమంలో పాల్గొన్న సందర్భాలు, ఆమరణ నిరాహార దీక్ష, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పథకాలను చేర్చారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌గా రాజర్షి సాంగ్.. దానికి తగ్గట్లు సీఎం కేసీఆర్ హావభావాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఈ వీడియో జోరుగా చక్కర్లు కొడుతోంది.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...