Home /News /trending /

TELANGANA CM KCR SET TO ENTER NATIONAL POLITICS WITH PARTY NAMED BHARATIYA RASHTRA SAMITI PAH

CM KCR: దేశ రాజకీయాల్లో కీలక పరిణామం.. కేంద్రంలో కొత్త పార్టీ పేరు ప్రకటించిన సీఎం కేసీఆర్..

సీఎం కేసీఆర్ (ఫైల్)

సీఎం కేసీఆర్ (ఫైల్)

Delhi: తెలంగాణా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక ఘట్టానికి మరో అడుగు ముందుకు వేశారు. కేంద్రంలో కొత్త పార్టీ పేరును ప్రకటించారు.

తెలంగాణ సీఎం (CM KCR) కేసీఆర్ దేశ రాజకీయాల్లో (National Politics) మార్పు రావాలని కొద్ది రోజులుగా అనేక రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. దేశంలో బీజేపీని ఎదుర్కొవడానికి బలమైన థర్డ్ ఫ్రంట్ అవసరమని ఆయన అనేక రాజకీయ పార్టీలను కలుపుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.ఈ క్రమంలో ఆయన శనివారం కీలక ప్రకటన చేశారు. కేంద్రంలో టీఆర్ఎస్ కొత్త పార్టీ పేరును .. భారతీయ రాష్ట్ర సమితి (Bharatiya Rashtra Samiti) అనే పేరు ను కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న 8 రాష్ట్రాల సీఎం లకు కలుపుకొని పోయే దిశగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ నెలలోనే పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని  అన్నారు.

అదే విధంగా ఇప్పటికే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా, ప్రెసిడెంట్ ఎన్నికలపై చర్చించడానికి పలు రాష్ట్రాల సీఎంలకు లేఖలను రాశారు. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో కీలక మైన పరిణామం చోటుచేసుకుంది. ఇటు కాంగ్రెస్ , భారతీయ జనతా  పార్టీని ఎదుర్కొనలేక చతికిల పడింది.





అయితే, దీనిపై బీజేపీ నేతలు దీనిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు వచ్చాయి. కానీ బీజేపీ ముందు నిలవలేక పోయాయని అన్నారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని తరుణ్ ఛుగ్ అన్నారు.



ఇదిలా ఉండగా తెలంగాణ మంత్రి హరిష్ రావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.

సాధారణ వ్యక్తులే రోడ్డు ప్రమాదాలను పెద్దగా పట్టించుకోని పరిస్థితులు ఉన్న ఈరోజుల్లో తెలంగాణ ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు(Harish Rao)మాత్రం తన వంతుగా మానవత ధర్మాన్ని పాటించారు. హైదరాబాద్‌(Hyderabad) నుంచి సిద్దిపేట(Siddipeta)కు మంత్రి కాన్వాయ్ (Convoy)వెళ్తుండగా మార్గం మధ్యలో తిమ్మారెడ్డిపల్లి(Thimmareddypalli)దగ్గర ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు పడిపోయింది. ప్రమాద సంఘటనను చూసిన మంత్రి తన కాన్వాయ్‌ని ఆపించారు.

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి..

ప్రమాదంలో గాయపడిన వాళ్లంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారు కావడంతో వాళ్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏం కాదులే కంగారుపడకండి అంటూ వాళ్లకు ధైర్యం చెబుతూనే వెంటనే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులు ఆదేశించారు. బాధితులను వేరే కారులో ఆసుపత్రికి తరలించే వరకు ఉండి వారికి భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళలు, పిల్లలు మంత్రి హరీష్‌రావు చూపించిన ఔదార్యం, చెప్పిన మాటలకు షాక్ నుంచి తెరుకున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Bjp, CM KCR, Delhi, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు