TEENAGE BOY SUICIDE ATTEMPT AT VITTHALWADI RAILWAY STATION IN THANE DISTRICT PAH
Shocking: పట్టాల మీద నుంచి యువకుడిని తోసేసిన ఆర్పీఎఫ్ పోలీసు.. కారణం ఏంటంటే..
పట్టాల మీద యువకుడు..
Maharashtra : మహారాష్ట్రలో ఒక రైల్వే పోలీసు చాకచక్యంగా వ్యవహారించాడు. టీనేజ్ యువకుడు పట్టాల మీద దూకి వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడ్డాడు. అక్కడే.. ప్లాట్ ఫామ్ పక్కన ఉన్న ఆర్పీఎఫ్ పోలీసు దీన్ని గమనించాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. పట్టాల మీదకు అమాంతం దూకి అతడిని దూరంగా తోసేశాడు.
Vitthalwadi railway station: థానె జిల్లాలో (Thane District) ఒక యువకుడు వెంట్రుక వాసిలో ప్రమాదం నుంచి బయట పడ్డాడు. ఏం కష్ట మోచ్చిందో కానీ.. రైలు కింద పడి ఆత్మహత్య (Suicide Attempt) చేసుకుందామనుకున్నాడు. ప్లాట్ ఫామ్ మీద రైలు కోసం వేచి చూశాడు. ఇక రైలు రాగానే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పట్టాల మీదకు దూకేశాడు. తొలుత.. చుట్టుపక్కల ఉన్నవారంతా.. ఏదో సీటు కోసం దూకాడేమో... అని భావించారు. కానీ ఆ తర్వాత.. అతను పట్టాల మీద పడుకున్నాడు. రైలు రావడానికి కొన్ని సెకన్లు మాత్రమే మిగిలున్నాయి. యువకుడిని దూరం నుంచి గమనించిన ఆర్పీఎఫ్ (Rpf Police) పోలీసు ఇతని ప్రాణాలు కాపాడాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో రకారకాల వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయంకరంగాను ఉంటాయి. కొన్ని సార్లు ఊహించని షాకింగ్ వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు వీడిని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొంత మంది రైల్వే పట్టాల మీద పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వీరి ప్రయత్నాన్ని అక్కడే ఉన్న రైల్వే అధికారులు లేదా ప్రయాణికులు కాపాడిన సంఘటనలు అనేకం చూశాం. ఇప్పటికే ఇలాంటి ఎన్నో వీడియోలు వైరల్ మారాయి. తాజాగా, ఇలాంటి వీడియో (Viral videos) మరోసారి వైరల్ అవుతుంది.
#WATCH | Maharashtra: A police personnel saved a teenage boy's life by pushing him away from the railway track just seconds before an express train crossed the spot at Vitthalwadi railway station in Thane district. (23.03)
మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విఠల్ వాడీ రైల్వే స్టేషన్ లో ఒక పసుపు రంగు చోక్క, బ్లూకలర్ ప్యాంట్ వేసుకున్న ఒక యువకుడు ప్లాట్ ఫామ్ (Plot form) మీదకు వచ్చి నిల్చున్నాడు. అతని కదలికలు అనుమానంగా ఉన్నాయి. అప్పుడు ఒక రైలు స్టేషన్ కు వస్తుంది. వెంటనే ఆ యువకుడు.. పట్టాల మీదకు దూకేసి.. రైలుకు ఎదురుగా అడ్డంగా పడుకున్నాడు. అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అప్పుడు ఒక ఆర్పీఫ్ పోలీసు చాకచక్యంగా వ్యవహారించారు. అమాంతం పట్టాల మీదకు దూకి యువకుడిని పట్టాల మీద నుంచి దూరంగా నెట్టేశాడు.
సెకనుల కాలంలో రైలు వారిని దాటేసింది. ఏ మాత్రం ఆలస్యం చేసిన యువకుడు బతికేవాడు కాదు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. పోలీసులు యువకుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకొవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆర్పీఎఫ్ పోలీసు చూపిన ధైర్య సాహాసాలకు అధికారులు ప్రశంసిస్తున్నారు. అదే విధంగా.. నెటిజన్లు కూడా హ్యాట్సాఫ్ సార్.. అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.