సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చెందిన భారత జట్టు వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించడం తెలిసిందే. మాంచెస్టర్‌లో ఉంటూ వచ్చిన హోటల్‌ను ఇప్పటికే వారు ఖాళీ చేశారు. అయితే భారత ఆటగాళ్ల స్వదేశీ పయనం కొన్ని రోజులు ఆలస్యంకానుంది. ఈ నెల 14(ఆదివారం) వరకు భారత ఆటగాళ్లు మాంచెస్టర్‌లోనే గడపనున్నారు. ఆటగాళ్లకు విమాన టికెట్లు ఏర్పాటు చేయడంలో బీసీసీఐ విఫలంకావడంతో ఆదివారం వరకు ఆటగాళ్లు అక్కడే గడపాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వరల్డ్ కప్‌లో భారత పోరు ముగియడంతో కొందరు జట్టు ఆటగాళ్లకు ఈ నెల 14న మాంచెస్టర్ నుంచి న్యూఢిల్లీకి విమాన టికెట్లు బుక్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు మాంచెస్టర్‌లోని వేరే హోటళ్లలో బస చేస్తున్నారు.
అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం ఆ రోజున మాంచెస్టర్ నుంచి స్వదేశానికి రావడం లేదు. మాంచెస్టర్ నుంచి కొన్ని రోజుల పాటు విహారయాత్రకు వెళ్ల్లేందుకు ప్లాన్స్ చేసుకున్నారు. గత కొన్ని మాసాలుగా వరల్డ్ కప్ కారణంగా అవిశ్రాంతంగా గడిపిన ఆటగాళ్లు...తమ కుటుంబీకులతో కలిసి వెకేషన్‌కు వెళ్లనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.