ఖడ్గమృగాల్ని కాపాడదాం... ఫ్యాన్స్‌కి రోహిత్ శర్మ పిలుపు...

ఎక్కడో ఆస్ట్రేలియాలో కంగారూలు, కోయలాలూ చనిపోయాయని బాధపడుతున్నాం. మన దేశంలోని అసోంలో చనిపోతున్న ఖడ్గమృగాల మాటేంటి? వాటిని కాపాడదాం అంటున్నాడు రోహిత్ శర్మ.

news18-telugu
Updated: January 23, 2020, 10:21 AM IST
ఖడ్గమృగాల్ని కాపాడదాం... ఫ్యాన్స్‌కి రోహిత్ శర్మ పిలుపు...
రోహిత్ శర్మ (credit - insta - Rohitsharma45)
  • Share this:
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కీలక బాధ్యతలు చేపట్టాడు. అదే... భారత ఖడ్గమృగాల్ని కాపాడే బాధ్యత. మీకు తెలుసు... మన దేశంలోని కొమ్ము ఖడ్గమృగాలు... అరుదైనవి. అవి మన దేశానికే సొంతం. ఒకప్పుడు... లక్షల్లో ఉండే ఈ రైనోలు.... ఇప్పుడు 20వేల కంటే తక్కువే ఉన్నాయి. ఫలితంగా ఇవి రెడ్ లిస్ట్ (అంతరించిపోయే జాతుల జాబితా)లో చేరిపోయాయి. ఇందుకు అనేక కారణాలు. ఒకటి వేటగాళ్లు. రెండోది... తగ్గిపోతున్న అడవులు. వేటగాళ్ల చర్యల్ని చాలా వరకూ... అసోం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నాయి. ఐతే... అడవుల్లో భాగమైన... అల్యూవియల్ గడ్డి మైదానాల్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ గడ్డి లేకపోవడం వల్ల చాలా ఖడ్గమృగాలు చనిపోతున్నాయని తెలిసింది. 

View this post on Instagram
 

I am Rohit Sharma & I #bat4rhinos. I am calling out to all my fans to help protect the mighty #indianrhino. @wwfindia


A post shared by Rohit Sharma (@rohitsharma45) on

ఈ గడ్డి మైదానాల్ని పెంచేందుకు... వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF)ఇండియా... ప్రయత్నిస్తోంది. పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా... టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సాయం తీసుకుంటోంది. అతని ద్వారా ప్రచారం చేయిస్తోంది. ఖడ్గమృగాల్ని కాపాడదామని పిలుపుస్తున్న రోహిత్ శర్మ... విరాళాలు ఇవ్వాల్సిందిగా ఫ్యాన్స్‌ని కోరుతున్నాడు.ప్రస్తుతం మన దేశంలో ఖడ్గమృగాలు జీవించేందుకు... 11 ప్రదేశాల్లో మాత్రమే అవకాశాలున్నాయి. అలాగే నేపాల్ దక్షిణాన కూడా కొంతవరకూ అవి జీవించే వీలుంది. ఈ ప్రాంతాల్ని కూడా కాపాడకపోతే... ఇక అవి జీవించే అవకాశాలే ఉండవు. అందుకే రోహిత్ శర్మ ఈ కీలక బాధ్యత చేపట్టాడు. రైనోల కోసం పిలుపు ఇస్తున్నాడు.
First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు