బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి నిన్న జరిగింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ పెళ్లికి వాళ్లిద్దరికీ సన్నిహితంగా ఉండే కొంతమంది మాత్రమే హాజరయ్యారు. వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కత్రినా పెళ్లి సందర్భంగా ఓ ఛాయ్‌వాలా ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ చాయ్‌వాలాకు సల్మాన్ మరియు కత్రినాతో స్పష్టమైన అనుబంధం ఉంది. ఈ ఫోటోలో ఒక వ్యక్తి టీ షాప్‌లో టీ చేస్తూ కనిపిస్తాడు. అయితే ఆ షాపుపై ప్రత్యేకంగా రాసి ఉన్న లైన్ జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వ్యక్తి షాపుపై కత్రినా చెవిలో సల్మాన్, సుధీర్ షాపులో టీ తాగుదాం అని రాసి ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
చాలామంది ఈ ఫోటోను షేర్ చేయడం ద్వారా కత్రినా, సల్మాన్ మధ్య రిలేషన్‌ను గుర్తు చేస్తున్నారు. పాట్నాలోని వీర్ కున్వర్ సింగ్ చౌక్‌లో సుధీర్ చాయ్‌వాలా దుకాణం ఉంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో కూడా ఈ ఫొటో వైరల్‌గా మారింది. కత్రినా, విక్కీల పెళ్లి గురించి అప్పట్లో ఎలాంటి చర్చలు లేకపోయినా.. సల్మాన్, కత్రినా పేర్లను జోడించి ఈ ఫొటోను తెగ వాడుతున్నారు.
అయితే ఈ ఫోటోను చాలామంది లైక్ చేయడం వెనుక మరో కారణం కూడా ఉంది. సల్మాన్, కత్రినా జోడిని ఫ్యాన్స్ బాగా లైక్ చేస్తుంటారు. ఒక దశలో సల్మాన్, కత్రినాను పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తరువాత వీరి మధ్య గ్యాప్ పెరిగిపోయిందనే టాక్ వచ్చింది. ఆ తరువాత వీరి కాంబినేషన్లో మళ్లీ సినిమాలు కూడా వచ్చాయి.
ఈ రకంగా సల్మాన్, కత్రినా జోడి పాపులర్ అయ్యింది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లికి ఎవరెవరు వెళుతున్నారనే చర్చ కంటే... ఈ పెళ్లికి సల్మాన్ ఖాన్ హాజరవుతున్నాడా ? లేదా అనే చర్చే సోషల్ మీడియా, మీడియాలో ఎక్కువగా జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, యువరాజ్, భరత్ వంటి చిత్రాలు వచ్చాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.