టీస్టాళ్లలో ఒకప్పుడు చెల్లించేందుకు మనీ ఇచ్చేవారు. ఆ తర్వాత గూగుల్ పే, పేటీఎం పే ఇలా ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాయి. ఇక్కడివరకూ ఓకే గానీ.. క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు రాలేదు. చెప్పాలంటే మనదేశంలో 95 శాతం మందికి అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటో, అది ఎలా పనిచేస్తుందో తెలియదు. ఆ డిజిటల్ కరెన్సీ వల్ల మోసాలు జరగవచ్చనే ప్రచారం.. దానిపై భారతీయులకు అనుమానాలు కలిగేలా చేసింది. దానికి తోడు ఈ డిజిటల్ కరెన్సీల విలువ... లక్షల్లో ఉంటుండటంతో.. వాటితో చిన్న చిన్న చెల్లింపులు జరపడం కష్టమనే అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ టీస్టాల్ కుర్రాడు మాత్రం టీ తాగి.. క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చెయ్యవచ్చని బోర్డ్ పెట్టాడు. ఆ కరెన్సీ తీసుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నా.. ఆ కరెన్సీలో చెల్లించేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారన్నది తేలాల్సిన ప్రశ్న.
ఆ టీస్టాల్ ఫొటోని పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా తన ట్విట్టర్ అకౌంట్ @hvgoenkaలో డిసెంబర్ 1న పోస్ట్ చేశారు. "కొత్త భారత్" అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ట్వీట్ కాస్తా వైరల్ అయ్యింది. దాన్ని గమనిస్తే.. అందులో టీ అమ్ముతున్న కుర్రాడి పేరు శుభమ్ సైనీ. బెంగళూరులో ఈ స్టాల్ ఉంది.
ఆ ట్వీట్ ఇక్కడ చూడండి (viral tweet)
The new India….. pic.twitter.com/MQjO6FHiOY
— Harsh Goenka (@hvgoenka) December 1, 2022
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కామెంట్ల రూపంలో తమ అభిప్రాయం చెబుతున్నారు. "ఇది క్రిప్'టీ'" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. "అడ్వాన్స్డ్ ఇండియా" అని మరో యూజర్ స్పందించారు. ఇంకా చాలా మంది ఎలా స్పందించారో ఇక్కడ చూడండి.
Cryptea more like it !
— Dipali Sikand (@SikandDipali) December 1, 2022
God bless..i hope some or the other day you buy Tesla and the bird
— eshwar rachakonda (@eshwar_rk) December 1, 2022
Is there any difference between e-rs and crypto?
— Swati Swagatika (@SwatiSwagatik20) December 1, 2022
క్రిప్టో కరెన్సీపై అవగాహన ఉందంటే.. కచ్చితంగా ఆ కుర్రాడు బాగానే చదువుకొని ఉండాలి అని మీకు అనిపిస్తే... మీ గెస్ కరెక్టే. నిజానికి అతనో క్రిప్టో కరెన్సీ ట్రేడర్. బీసీఏ కోర్స్ చేస్తూ.. కొన్ని కారణాలతో మధ్యసలోనే ఆపేశాడు. ఆ తర్వాత ఫ్రస్ట్రేటెడ్ డ్రాపవుట్ పేరుతో టీస్టాల్ ప్రారంభించాడు. తను నమ్మిన క్రిప్టో కరెన్సీలో చెల్లింపులను అనుమతించడం ద్వారా అతను అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. కనీసం ఇలాగైనా డిజిటల్ కరెన్సీపై ప్రజల్లో ఉన్న భయాలు తగ్గుతాయనే ఉద్దేశంతో అతను ఇలా చేస్తూ ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending news, VIRAL NEWS