పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పేసిన రతన్ టాటా.. నాలుగు సార్లు పెళ్లి దాకా వెళ్లి..

Ratan Tata: 81 ఏళ్ల జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, నిలబడ్డ రతన్ టాటా.. వివాహం మాత్రం చేసుకోలేదు. మరి, పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అని ఆయన్ను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 22, 2019, 12:55 PM IST
పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పేసిన రతన్ టాటా.. నాలుగు సార్లు పెళ్లి దాకా వెళ్లి..
రతన్ టాటా (ఫైల్)
  • Share this:
రతన్ టాటా.. భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు.. మధ్య తరగతి ప్రజల ‘నానో కారు’ రూపకర్త.. కోట్లాది ప్రజల నమ్మకానికి మారు పేరు.. లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప వ్యక్తి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకు ఆయనే సాటి. 81 ఏళ్ల జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, నిలబడ్డ ఈ బిజినెట్ టైకూన్.. వివాహం మాత్రం చేసుకోలేదు. మరి, పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అని ఆయన్ను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ పత్రిక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన జీవితంలో పెళ్లి, ప్రేమ ఏ స్థానంలో ఉండేది? అవి ఎలా దూరమయ్యాయి.. అన్న విషయాలు తెలిపారు. తన జీవితంలో నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, కానీ ఒక్కసారి కూడా అందులో విజయం సాధించలేకపోయానని టాటా గ్రూప్ అధినేత మనసులోని మాటను బయటపెట్టారు. ప్రేమాయణం గురించి మరింత లోతుగా చెప్పాలని ఆయన్ను కోరగా..

‘1962వ సంవత్సరం అది.. అమెరికాలో పనిచేస్తున్నప్పుడు ఓ అమెరికా అమ్మాయితో ప్రేమలో పడ్డా. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. అయితే, మా నానమ్మ అనారోగ్యానికి గురి కావడంతో ఉన్నపళంగా ఇండియాకు వచ్చేశా. తానూ నాతో రావడానికి ఇష్టపడింది. కానీ, ఆ సమయంలో ఇండో-చైనా యుద్ధం జరుగుతోంది. ఆ ప్రభావం ఆమెపై పడిందనుకుంటా. తాను ఇండియాకు రానని చెప్పేసి, వేరొకరితో పెళ్లి చేసుకుంది’ అని రతన్ టాటా మనసు విప్పారు.

అలాగే, మిగిలిన మూడు సార్లు ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోక పోవడానికి కారణాలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. మీరు ప్రేమించిన వారు ఎవరైనా ఢిల్లీలో ఉన్నారా అంటే.. ఉన్నారని చెప్పిన ఆయన మరిన్ని వివరాలను వెల్లడించడానికి మాత్రం నిరాకరించారు. అయితే, తన వరకు పెళ్ళి చేసుకోకపోవడం అదృష్టంగానే భావిస్తున్నానన్నారు. పెళ్ళి చేసుకోకపోవడం తప్పేమి కాదని, ఒక వేళ చేసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అన్నారు.

First published: July 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>