30 పిల్లల తండ్రి... రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు... ఎలా?

ఈ న్యూస్ ద్వారా మనకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ఓ అరుదైన వజ్రపు రాయి విశేషాలు తెలుస్తాయి. ఆలస్యమెందుకు చకచకా చదివేద్దాం.

news18-telugu
Updated: August 5, 2020, 8:46 AM IST
30 పిల్లల తండ్రి... రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు... ఎలా?
30 పిల్లల తండ్రి... రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు... ఎలా? (credit - twitter)
  • Share this:
ఆఫ్రికా దేశాలు అనగానే... మనకు పేదరికం, ఆకలి చావుల వంటివి కళ్లముందు కనిపిస్తాయి. అవి నిజమే. కానీ... అదే ఆఫ్రికాలో అత్యంత సంపన్నులు కూడా ఉన్నారు. మన దేశంలో లాగే అక్కడ కూడా మనుషుల మధ్య ఆర్థక వ్యత్యాసాలు భారీగా ఉన్నాయి. ఆ టాపిక్ అలా ఉంచితే... ఆఫ్రికా దేశమైన టాంజానియాలో ఓ తండ్రి గురించి మనం చర్చించుకుందాం. ఆయన ఓ గని యజమాని... రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు. జూన్‌లో ఆయన రెండు రాళ్లు అమ్మాడు. ఒకటి 9.2 కేజీలుంది. మరొకటి 5.8 కేజీలుంది. వాటితో రూ.25 కోట్లు సంపాదించాడు. ఎందుకంటే అవి మామూలు రాళ్లు కావు. ఆ రాళ్లు అత్యంత ఖరీదైన టాంజనైట్ (Tanzanite) ఖనిజంతో ఉన్నవి. తాజాగా మరో రాయి అమ్మాడు. మరో రూ.14 కోట్లు వెనకేసుకున్నాడు. సానినూ లైజర్‌ దగ్గర మరికొన్ని రాళ్లు ఉన్నాయి. అవి 6.3 కేజీల బరువున్నాయి. అవి కూడా అమ్మితే ఇక డబ్బే డబ్బు.


అరుదైన వజ్రపు రాళ్లు : టాంజనైట్ అనేది ఎక్కడ బడితే అక్కడ దొరకదు. భూమిపై అరుదైన వజ్రపు రాళ్లలో ఇవీ ఒకటి. వచ్చే 20 ఏళ్ల తర్వాత ఇక ఎంత వెతికినా ఈ రాళ్లు కనిపించకపోవచ్చని భూగర్భ పరిశోధకులు చెబుతున్నారు. ఈ రాళ్లు రకరకాల రంగుల్లో ఉంటాయి. మెరుస్తాయి. రెడ్, గ్రీన్, పర్పుల్, బ్లూ కలర్స్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటాయి. అరుదైనవి కాబట్టి రేటు కూడా అదిరిపోతోంది. రాయి అరుదైనది కావడంతోపాటూ... దాని రంగును బట్టి కూడా ధర డిసైడవుతోంది.

సానినూ లైజర్‌ మంచివారు. స్థానిక చిన్న చిన్న గనుల యజమానులను పిలిచి... మీరు కూడా ప్రభుత్వ అనుమతి తీసుకొని... బాగా వెతకండి. మీకూ ఇలాంటివి దొరికే ఛాన్సుంది అని చెప్పారు. లైజర్ తన రాళ్లను ప్రభుత్వానికే అమ్మారు. తద్వారా ఎలాంటి అక్రమాలూ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే టాంజానియాలో గనుల మోసాలు చాలా జరుగుతున్నాయి. త్వరలోనే తన 30 మంది పిల్లలకూ అదిరిపోయే పార్టీ ఇస్తానని లైజర్ చెప్పారు.

52 ఏళ్ల లైజర్‌కి ప్రభుత్వం జూన్ 24న చెక్ ఇచ్చింది. ఇప్పటివరకూ టాంజానియాలో దొరికిన అతి పెద్ద టాంజనైట్ బరువు 3.5 కేజీలు ఉంది. ఆ రికార్డును లైజర్ తుడిచిపెట్టాడు. మరి టాంజానియా అభివృద్ధి చెందిన దేశమేమీ కాదు. అక్కడ నిరుద్యోగం ఉంది. సరైన వేతనాలు రావు. అవి కూడా టైమ్ ప్రకారం ఇవ్వరు. ఇవన్నీ కళ్లారా చూస్తూ పెరిగిన లైజర్... తన డబబుతో... ఓ స్కూలు, ఓ హాస్పిటల్‌ను సిమాన్జిరో జిల్లాలో నిర్మిస్తానని తెలిపారు. అంత డబ్బు వచ్చినా... తాను ఎప్పటిలా సాదాసీదాగా ఉంటానే తప్ప... సంపన్నుడిలా వ్యవహరించనని తెలిపారాయన.

లైజర్‌కి 2000 ఆవులున్నాయి. వాటిని మరింత బాగా చూసుకుంటానన్నారు. టాంజానియాలో ప్రభుత్వం అనుమతి ఇవ్వాలేగానీ... గనుల తవ్వకాలు జరిపేందుకు చాలా మంది చిన్న గనుల యజమానులు సిద్ధంగా ఉన్నారు. కానీ... ఇల్లీగల్ మైనింగ్ బాగా జరుగుతోందని ప్రభుత్వం ఇలాంటి వాటిని ఆపేసింది. అంతేకాదు... మన్యారా గని చుట్టూ... 24 కిలోమీటర్ల పొడవైన గోడను నిర్మించమని ఆర్మీని ఆదేశించింది. ఎందుకంటే ఆ గని దగ్గరే ఈ టాంజనైట్ దొరుకుతోంది.
Published by: Krishna Kumar N
First published: August 5, 2020, 8:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading