Home /News /trending /

TAMILNADU YOUTH BUYS CAR USING 10 RUPEE COINS TO CREATE AWARENESS ABOUT THE CURRENCY PVN

buys car using 10 Rupee coins : లక్షల విలువైన కారుని రూ.10 నాణేలతో కొన్న యువకుడు..కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రూ.10 నాణేలతో కారు కొనుగోలు చేసిన యువకుడు

రూ.10 నాణేలతో కారు కొనుగోలు చేసిన యువకుడు

Man buys car using 10 Rupee coins : రూ.10 నాణేలు చెల్లుతాయ్ అని రిజర్వ్ బ్యాంక్ చెప్పినా కూడా..కొద్ది నెలలుగా కిరాణా షాపుల్లోనూ, బస్సుల్లోనూ 10 రూపాయలు నాణేలు తీసుకోక పోవటంతో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. దాంతో ప్రజలు కూడా వారి వద్ద నుంచి 10 రూపాయల నాణేలు తీసుకోవటం మానేశారు.

ఇంకా చదవండి ...
Man buys car using 10 Rupee coins : రూ.10 నాణేలు(10 Rupee Coins) చెల్లుతాయ్ అని రిజర్వ్ బ్యాంక్ చెప్పినా కూడా..కొద్ది నెలలుగా కిరాణా షాపుల్లోనూ, బస్సుల్లోనూ 10 రూపాయలు నాణేలు తీసుకోక పోవటంతో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. దాంతో ప్రజలు కూడా వారి వద్ద నుంచి 10 రూపాయల నాణేలు తీసుకోవటం మానేశారు. మొత్తంగా ప్రజలకు వీటి వల్ల గొప్ప చికాకు వచ్చి పడింది. అయితే రూ.10 నాణేలు చెల్లవంటూ జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసేలా తమిళనాడు(Tamilnadu)లోని అ ధర్మపురి జిల్లాకు చెందిన వ్యక్తి వినూత్న కార్యక్రమం చేపట్టాడు. ఆరు లక్షల ఖరీదైన కారును మొత్తం రూ.10 నాణేలతో కొన్నాడు. ఇప్పటిదాకా తమకు నచ్చిన బైక్‌ లేక కారు కొనుక్కునేందుకు చిల్లర నాణేలు పోగు చేసి మరీ కొనుకున్న సందర్భాలు చూశాం. అవన్నీ వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లేదా తమ కోరిక నెరవేర్చుకోవాలన్న తాపత్రయం వంటి కారణాల రీత్యా ఇలా కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. కానీ,రూ.10 నాణేలతో తాజాగా కారు కొనుగోలు చేసిన వ్యక్తి మాత్రం వారందరికీ భిన్నం.

తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలోని హరూర్(Harur) కి చెందిన ఆర్.వెట్రివేల్(25)అదే ప్రాంతంలో నర్సరీ పాఠశాల నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల వెట్రివేట్ ఇంటి ముందు కొందరు పిల్లలు రూ.10 నాణేలతో ఆడుకోవడం గమనించిన వెట్రివేల్.. వారిని ప్రశ్నించాడు. అయితే ఆ నాణేలు చెల్లవని,అందుకే వాటితో ఆడుకుంటున్నామని పిల్లలు బదులిచ్చారు. కేంద్రం, రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.10 నాణేలు చెల్లవంటూ ప్రకటన చేయకపోయినా వ్యాపారులు మాత్రం వాటిని తీసుకోకపోవడంపై విస్మయం చెందిన వెట్రివేల్ ఈ విషయమై ప్రజలను అవగాహన కల్పించాలని నిర్ణయించారు. రూ.10 కాయిన్ లో చెల్లుతాయ్ అని ప్రజలకు తెలిసేలా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగా చాలారోజుల నుంచి తాను కొనాలనుకున్న కారుని రూ.10 నాణేలతోనే కొనాలని వెట్రివేల్ డిసైడ్ అయ్యాడు. గడిచిన నెల రోజులుగా వివిధ బ్యాంకులకు వెళ్లి ఆరు లక్షల రూపాయల రూ.10 నాణేలను సమకూర్చుకున్నాడు.



OMG : దారుణం..మహిళను బిల్డింగ్ పై నుంచి తోసేసిన అత్తింటివాళ్లు!

నోట్ల రూపంలో బ్యాంకులో డబ్బులు ఇచ్చి..వారి వద్ద నుంచి ఆ మొత్తాన్ని రూ.10 కాయిన్స్ రూపంలో తీసుకున్నాడు. తాను కొనాలనుకున్న కారు ఖరీదుకి సరిపోయినన్ని రూ.10 కాయిన్స్ పోగడవడంతోఈ నాణేలతో కారు కొనుగోలు చేసేందుకు సేలంలోని కారు షోరూమ్‌ నిర్వాహకులను కలిశాడు. వారు బ్యాంక్‌ అధికారులను సంప్రదించిన తరువాత అతడి ప్రతిపాదనకు అంగీకరించారు. దీంతో రూ.10 నాణేలతో కూడిన బస్తాలను ఆటోలో శనివారం సేలంలోని సూరమంగళంలోని కార్ షోరూంకి తీసుకొచ్చాడు. రూ.6లక్షల విలువైన రూ.10కాయిన్స్ చెల్లించి కారు కొనుగోలు చేశారు. షోరూం సిబ్బందికి ఈ కాయిన్స్ లెక్కించడానికి నాలుగు గంటల సమయం పట్టింది.ఆరు లక్షలను పది రూపాయల నాణేల్లో అందుకున్న షోరూమ్‌ డీలర్‌ చివరకు కారు తాళాలను వెట్రివేల్‌కు అందజేశాడు. దీంతో అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ కొత్త కారులో ఇంటికి చేరుకున్నాడు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: CAR, Coins, Tamilnadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు