హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: వైన్ బాటిల్ చూసి కక్కుర్తి పడిన దొంగ.. తెల్లారే వరకు అదే పని.. ఆ తర్వాత..

OMG: వైన్ బాటిల్ చూసి కక్కుర్తి పడిన దొంగ.. తెల్లారే వరకు అదే పని.. ఆ తర్వాత..

వెలుగులోకి చోరీ ఘటన

వెలుగులోకి చోరీ ఘటన

Tamilanadu: కొన్ని రోజులుగా సదరు ఇంట్లో ఎవరు ఉండటం లేదు. దీన్ని కొందరు దొంగలు రెక్కి వేసి మరీ కన్ఫామ్ చేసుకున్నారు. అప్పుడు మెల్లగా అర్ధరాత్రి ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు.

  • Local18
  • Last Updated :
  • Tamil Nadu, India

చోరీ చేయడం కూడా ఒక ఆర్ట్. కొందరు దొంగతనం చేస్తు ఇట్టే దొరికిపోతుంటే, మరికొందరు మాత్రం దొంగతనం చేసి మూడో కంటికి తెలియకుండా పారిపోతుంటారు. మనం తరచుగా రోడ్ల మీద కొందరు బైక్ ల మీద స్పీడ్ గా వచ్చి ఆడవాళ్ల మెడలో నుంచి చైన్ లను, మంగళ సూత్రాలను తెంపుకుని వెళ్లే చోరీ చేసిన ఘటనలను తరచుగా చూస్తూనే ఉంటాం. కొందరు మాత్రం పగటి పూట ఏదో బిజినెస్ చేస్తున్నట్లు అపార్ట్ మెంట్ ల ముందు, నగర శివారులలో ఉన్న ఇళ్ల దగ్గరకు వెళ్లి రెక్కి నిర్వహిస్తుంటారు.

అప్పుడు.. కొన్నిరోజుల పాటు తాళం ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుంటారు. మెల్లగా ఇంట్లోకి ప్రవేశించి, తెల్లారేసరికి వచ్చిన పని కానిచ్చేస్తుంటారు. అయితే.. దొంగలు చోరీలు చేసేటప్పుడు కొన్ని సార్లు ఫన్నీ సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఇప్పటికే దొంగతనానికి వచ్చి కిచెన్ లోని ఫుడ్ ఐటమ్స్ లను తింటుండటం, మరికొందరు అక్కడ ఉండే మద్యం సేవించి, మత్తులో జారుకున్న సంఘటనలు కూడా గతంలో అనేకం జరిగాయి. ఇలాంటి వెరైటీ దొంగతనం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

పూర్తి వివరాలు... తమిళనాడులో (Tamilnadu) చెన్నైలో ఒక విచిత్రమైన చోరీ ఘటన వార్తలలో నిలిచింది. చెన్నై అడయార్‌లోని కస్తూరిబాయి నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని ఒక ఇంటి యజమాని తన కుటుంబంతో కలిసి ఇతర ప్రాంతంలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లాడు. అప్పుడు కొన్నిరోజులుగా ఇంటికి తాళం వేసే ఉంది. ఈ క్రమంలో సదరు ఇంటిని కొందరు దొంగలు గమనిస్తున్నారు . ఒక రోజు రాత్రి.. వీరి ఇంట్లోకి దొంగలు తాళం చేవి పగులగొట్టి ప్రవేశించారు. ఆ తర్వాత.. బీరువాలోని డబ్బులు,నగలను దోచుకున్నాడు.

అక్కడే ఫ్రిడ్జ్ లో మద్యం బాటిళ్లు ఉండటాన్ని దొంగ గమనించాడు. వెంటనే వచ్చిన పని మర్చిపోయి ఫూల్ గా తాగేశాడు. కాసేపటికే అతగాడు.. నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో మరుసటి రోజు ఇంటి యజమాని ఇంటికి వచ్చిచూశాడు. అప్పుడు ఇంటి తాళం పగులగొట్టి ఉండటం చూసి టెన్షన్ పడ్డాడు. వెంటనే బెడ్ రూమ్ లోకి వెళ్లి చూశాడు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ కు గురయ్యాడు. బెడ్ మీద ఒక వ్యక్తి గుక్కపెట్టి నిద్రపోతున్నాడు. అతనికి దగ్గరలో సంచులు ఉన్నాయి. వెంటనే యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆ తర్వాత ఇంట్లోని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా మద్యం మత్తులో ఉన్న దొంగ మంచం కింద గాఢనిద్రలో ఉన్నాడు. వెంటనే దొంగను పట్టుకునేందుకు యజమాని ప్రయత్నించారు. అయితే దొంగ నిద్ర నుంచి లేచి రెప్పపాటులో ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో చోరీ చేసి పారిపోయిన దొంగ ఏముమలై (27 ఏళ్లు)ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన దొంగ నుంచి రూ.49,000 కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి వెళ్లిన స్థలంలో మద్యం మత్తులో గురకపెట్టి గాఢనిద్రలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

First published:

Tags: Crime news, Tamilnadu, VIRAL NEWS

ఉత్తమ కథలు