హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

కండువాలు పట్టుకుని మరీ కొట్టుకున్న ఇద్దరు స్వామీజీలు.. అసలేం జరిగిందంటే..

కండువాలు పట్టుకుని మరీ కొట్టుకున్న ఇద్దరు స్వామీజీలు.. అసలేం జరిగిందంటే..

కొట్టుకుంటున్న స్వామీజీలు

కొట్టుకుంటున్న స్వామీజీలు

Singapore Swamiji fight: ఇద్దరు స్వామీజీలు ఒక భక్తుడి ఇంట్లో పూజలు చేశారు. ఆతర్వాత.. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. దీంతో అక్కడ ఉన్న హల్క్ స్వామీజీ, మరోక స్వామీజీపై దాడికి దిగాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India

తమిళనాడుకు (Tamilnadu) చెందిన ఇద్దరు స్వామిజీల మధ్య రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది. సింగపూర్ లో రాజ్ కుమార్ స్వామి, స్థానికంగా ఉండే హల్క్ స్వామీజీలు ఒక భక్తుడి ఇంట్లో పూజలు చేశారు. అంతా అయిపోయాక.. ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అనే విషయంపై రచ్చ జరిగింది. దీంతో నేను గొప్ప అని.. రాజ్ కుమార్ స్వామి అంటే... కాదు కాదు.. నేనే గొప్ప అంటూ హల్క్ స్వామి రెచ్చిపోయారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

హల్క్ స్వామి ఏకంగా రాజ్ కుమార్ స్వామి మెడలోని కండువ పట్టుకుని ఆయనపై దాడిచేశారు. ఆయన చేతిలో నుంచి ఎంతో కష్టపడి రాజ్ కుమార్ స్వామి విడిపించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య భౌతిక దాడుల వరకు వెళ్లింది. రాజ్ కుమార్ స్వామి తంజావురుకు చెందిన పుదుకొట్టై కు చెందిన రుద్ర సిద్ధర్ రాజ్ కుమార్ స్వామి స్థానికంలో ఎలాంటి సమస్యలనైన పరిష్కరిస్తారనే మంచి పేరు ఉంది. దీంతో ఆయనను సింగపూర్ కు చెందిన ఒక భక్తుడు తన తండ్రి సమస్యలను దూరం చేయాలని ఆయన ఇంటికి తీసుకెళ్లారు.

అప్పటికే అక్కడ హల్క్ స్వామీజీ కూడా ఉన్నాడు. పూజ తర్వాత.. ఇద్దరు భక్తుడిని ఆశీర్వదించాడు. ఈ క్రమంలో పూజ తర్వాత.. ఎవరు గొప్ప అనే దానిపై ఇద్దరు స్వామీజీల మధ్యరచ్చ వచ్చింది. దీంతో ఇద్దరు కూడా కొట్టుకున్నాడు. దుస్తులు లాక్కుని, మరీ కొట్టుకున్నారు. ప్రస్తుతం స్వామీజీల గొడవ సోషల్ మీడియాలో వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు. భక్తులకు శాంతిప్రవచనాలు బోధించాల్సిన స్వామీజీలు ఇలా కొట్టుకొవడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా కేరళలో (Kerala) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

అడవికి దగ్గరగా ఉన్న రూట్ లో రాత్రిపట ఆటోలు, కార్లు వెళ్తున్నాయి. ఇంతలో ఒక అడవిదున్న సడెన్ గారోడ్డు మీదకు వచ్చింది. ఏమైందో ఏమో కానీ.. కోపంగా పరిగెత్తుకుంటు ఆటోవైపుకు వచ్చింది. ఈ క్రమంలో బాహుబలి రేంజ్ లో ఆటోపై దాడిచేసింది. ఆటోను తన కొమ్ములతో లేపి అవతలవైపుకు పడేసింది.ఈ కుదుపుకు ఆటో గాల్లో ఎగిరి మరల కిందకు పడింది. అయితే.. దాని కోపం ఇంకా చల్లారలేదో ఏంటో కానీ.. మళ్లి వెనక్కుతిరిగి వచ్చింది.

ఆటోవైపుకు వచ్చింది. కానీ అప్పటికే ఆటో అతను చాకచక్యంగా వ్యవహరించి, అక్కడి నుంచి వేగంగా ఆటోను పొనిచ్చాడు. ఆటో వెనుకాల ఉన్న వారు.. ఈ ఘటనను వీడియో తీస్తున్నారు. దానిలో దున్నపోతు దాడికి సంబంధించిన విజువల్స్ రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Tamilnadu, Viral Video

ఉత్తమ కథలు