ఒక్క విందు భోజనం.. దరిద్రం వదిలి కోటీశ్వరుడైపోయాడు..

తమిళనాడులోని పుదుక్కోటై జిల్లా కీరమంగళం తాలూకాలో ఓ సంప్రదాయం ఉంది. అది చినరాయుడు సినిమాలో లాంటి సంప్రదాయం.

news18-telugu
Updated: July 27, 2019, 7:51 PM IST
ఒక్క విందు భోజనం.. దరిద్రం వదిలి కోటీశ్వరుడైపోయాడు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీరు ఆ ఒక్కటీ అడక్కు సినిమా చూశారా? అందులో రాజేంద్ర ప్రసాద్.. మామ అడిగిన ఎదురుకట్నం ఇవ్వడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. పెళ్లికి వచ్చిన వారు ఇచ్చే చదివింపుల డబ్బులతో గట్టెక్కొచ్చని అనుకుంటాడు. అయితే, అతడి ప్లాన్ వర్కవుట్ కాదు. కానీ, తమిళనాడులో ఓ రైతుకు వర్కవుట్ అయింది. ఏకంగా కోటీశ్వరుడు అయ్యాడు. తమిళనాడులోని పుదుక్కోటై జిల్లా కీరమంగళం తాలూకాలో ఓ సంప్రదాయం ఉంది. అది చినరాయుడు సినిమాలో లాంటి సంప్రదాయం. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు గ్రామంలోని అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయాలి. విందుకు వచ్చిన వారు తమకు తోచినంత ఆ విస్తరికింద పెట్టి వెళ్తారు. అయితే, ప్రస్తుతం ట్రెండ్ మారింది కాబట్టి చక్కగా భోజనం ఏర్పాటు చేసిన వారి చేతికి ఇచ్చి వెళ్తున్నారు. ఇలాంటి సంప్రదాయం కీరమంగళం తాలూకాలో కూడా ఉంది.

కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న కృష్ణమూర్తి అనే రైతు.. ఇలాంటి విందు ఏర్పాటు చేశాడు. గ్రామస్తులు అందరినీ పిలిచాడు. రకరకాల వంటకాలు వండి వడ్డించాడు. సుమారు రూ.15లక్షలు ఖర్చు పెట్టాడు. గ్రామంలో 5వేల మంది వరకు ఈ విందుకు హాజరయ్యారు. కృష్ణమూర్తి పరిస్థితి చూసి తమకు తోచినంత ఆర్థిక సాయం చేశారు. అవన్నీ లెక్కపెడితే సుమారు రూ.4కోట్లు వచ్చినట్టు లెక్కతేలింది. డబ్బులను లెక్కపెట్టడానికి ఆ ఊరిలోని బ్యాంకులో ఉన్న మనీ కౌంటింగ్ మెషిన్ కూడా తీసుకురావడం ఇక్కడ కొసమెరుపు.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading