news18-telugu
Updated: July 12, 2019, 2:51 PM IST
తమిళనాడు జ్యోతిష్కుడు బాలాజి హాసన్
సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో వైరల్‌గా మారింది. క్రికెట్ వరల్డ్ కప్‌ను న్యూజిలాండ్ గెలుచుకుంటుందని తమిళనాడుకు చెందిన బాలాజి హాసన్ అనే జ్యోతిష్కుడు చెబుతున్న వీడియో అది. ఆ వీడియో సోషల్ మీడియాలో అంతలా చక్కర్లు కొడుతుండడానికి ప్రత్యేక కారణం లేకపోలేదు. నాలుగు జట్లు- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరుకుంటాయని బాలాజి హాసన్ ముందే అంచనావేయడం విశేషం. సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుందని...అందులో వరల్డ్ కప్ రేసులో కొత్తగా బరిలో నిలుస్తున్న న్యూజిలాండ్ గెలుస్తుందని కూడా ఆయన అంచవేశాడు. బాలాజి హాసన్ చెప్పినట్లే సెమీస్‌లో భారత్ ఓడిపోగా...న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరింది. కొత్త సంవత్సరాది (జనవరి 1) సందర్భంగా దాదాపు ఆరు మాసాల క్రితం ఓ తమిళ టీవీ ఛానళ్లో ఈ కార్యక్రమం ప్రసారమయ్యింది.
మరో సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. రెండ్రోజుల క్రితం జరిగిన ఫేస్బుక్ లైవ్‌లో సెమీస్‌లో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందని చెప్పడం విశేషం. ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. తాజాగా వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ గెలుస్తుందని అంచనావేశారు. కాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 2022లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని...2024 తర్వాత రాజకీయాల్లో ఉండబోరని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై స్పందిస్తూ త్వరలోనే కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో తమిళనాడును చికున్ గుల్యా తరహా విష జ్వరం కారణంగా ప్రజలు అవస్థలకు గురికావాల్సి ఉంటుందని జోస్యం చెప్పారు. బాధితుల్లో 80 శాతం మంది మహిళలుగా ఉంటారని వ్యాఖ్యానించారు.
ఫిఫా వరల్డ్ కప్‌ను ఫ్రాన్స్ గెలుచుకుంటుందని, తమిళ హీరో విశాల్‌కు పెళ్లి జరుగుతుందని, బీజేపీ రెండోసారీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, బీజేపీ-అన్నాడీఎంకే మధ్య పొత్తు కుదురుతుందని, వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎం అవుతారని, ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని అవుతారని, కొత్త సంవత్సరాది సందర్భంగా బాలాజి హాసన్ అంచనావేయగా...అవన్నీ నెరవేరడం విశేషం. వృత్తిరీత్యా హ్యుందాయ్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు బాలాజి హాసన్
Published by:
Janardhan V
First published:
July 12, 2019, 11:13 AM IST