Home /News /trending /

TAMILNADAU CM MK STALIN TOOK ONE MORE KEY DECISION VRY

CM Stalin: గ్రేట్ సీఎం.. సాధారణ ప్రజలతోనే ప్రయాణం.. తన సెక్యూరిటిపై కూడా...!

CM Stalin: గ్రేట్ సీఎం.. సాధారణ ప్రజలతోనే ప్రయాణం..

CM Stalin: గ్రేట్ సీఎం.. సాధారణ ప్రజలతోనే ప్రయాణం..

CM Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. తన సెక్యూరిటిని తగ్గించుకోవడంతో పాటు సాధారణ ప్రజలతోనే ప్రయాణించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.  తమిళనాడు(Tamilnadu) సీఎం స్టాలిన్ (stalin) ఎన్నిక తర్వాత ఆ రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఆ రాష్ట్ర నెటిజన్లతో పాటు ప్రజల్లో మంచి క్రేజ్ సంపాందించారు. స్టాలిన్ పరిపాలనలో కొత్త ట్రెండ్(trend) సెట్ చేస్తునే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెక్యూరిటీలోని కాన్వాయ్‌ని తగ్గించుకోవడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సాధారణ ప్రజల వాహనాలతో పాటే వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు.

  సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు ప్రత్యేక భద్రత ఉంటుంది. వారికి సిగ్నల్ ఫ్రి అవకాశాలతో పాటు ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో ఏ ఒక్క వావానాన్ని కూడా అనుమతి ఇవ్వరు.. సీఎం కాన్వాయ్ వస్తుందంటే ఆయన ప్రయాణిస్తున్న మార్గం వెంట వందలాది మంది పోలీసులు కాపాలా ఉంటారు. సీఎం వాహానం వచ్చే కనీసం పదినిమిషాల ముందు ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపివేయడం, మొత్తం మార్గాలను మూసివేయడం జరుగుతోంది. దీంతో పట్టణాల్లో ప్రయాణించే వాహానదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

   ఇది చదవండి : దివ్వాంగురాలు ఇంటికి మధ్యాహ్నం పూట ఒక్కడే.. వెళ్లాడు.. కట్ చేస్తే.. ?


  దీంతో సీఎం స్టాలిన్ తన సెక్యూరిటిలోని భారి కాన్వాయ్‌ను సగానికి తగ్గించారు. ఆయనకు జడ్‌ కేటాగిరి సెక్యూరిటి ఉన్నా కేవలం ఐదు వాహానాలనే కాన్వాయ్‌ ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సీఎం వెలుతున్నప్పుడు సిగ్నల్ ఫ్రి లేకుండా చేశాడు. సాధారణ ప్రజలతోనే తాను ప్రయణించే విధంగా చర్యలు చేపట్టారు. దీంతో సీఎం రూట్లో ప్రత్యేకంగా ట్రాఫిక్‌ను అపడం లాంటి వాటికి ఇక చెన్నైలో ఫుల్‌స్టాప్ పడనుంది.

  కాగా గతంలో కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఆర్ధరాత్రి(midnight) సమయంలో సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న సమయంలోనే అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు.. లోపలికి వెళ్లి పోలీసు స్టేషన్ నిర్మాణానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. పీఎస్‌ను ఎప్పుడు నిర్మించారు.. పోలీసు స్టేషన్‌ను ఎప్పుడు ప్రారంభించారు లాంటి వివరాలను తెలుసుకున్న సీఎం.... పీఎస్‌లో నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.. స్టేషన్‌లో నమోదైన ఆ కేసుల విచారణ ఎక్కడ వరకూ వచ్చాయి అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పోలీసు సిబ్బంది బాగోగుల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుని.. ఆ తర్వాత వెళ్లిపోయారు.

  ఇది చదవండి :  భారీ వర్షానికి కుప్పకూలిన గోడ.. ఒకే ఇంట్లో ఐదుగురు మృతి

  కాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం స్టాలిన్ దేశ రాజకీయాలకు ఆదర్శంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను ఆ ఫోటోలను కూడా ప్రస్తుత ముఖ్యమంత్రులు వాటిని కొనసాగించకపోవడం లేదంటే వాటి మీద తమ ఫోటోలను పెట్టి ప్రచారం చేసుకుంటారు. గత ప్రభుత్వాలు తీసుకున్న ఏ పథకాన్నైనా తమ స్వంత పథకంగా ప్రచారం చేసుకుంటారు. ఈ అయితే స్టాలిల్ మాత్రం ఇలా చేయలేదు.. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత ఫోటోలను స్కూల్ బ్యాగులపై అలాగే ఉంచి పంపిణి చేశారు. గతంలో ప్రింట్ చేసిన బ్యాగులపై జయలలిత ఫోటోను తొలగించకుండా చేసి రాష్ట్ర ఖాజనాపై భారం పడకుండా చేశాడు. మరోవైపు అమ్మ క్యాంటిన్లలో కూడా ఇదే విధంగా పాత సీఎం ఫోటోలు మార్చకుండా వాటిని కొనసాగించారు.  ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలకు గిఫ్టులు ఇచ్చే అలవాటుతోపాటు అసెంబ్లీలో క్యాంటిన్ సేవలను కూడా నిలిపి వేశారు. ఎమ్మెల్యేలు ఇంటినుండే భోజనం తెచ్చుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ముఖ్యమంత్రిని పోగుడుతున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలను సున్నితంగా హెచ్చరించారు. ఇంకోసారి రిపిట్ కావద్దని చెప్పారు. దీని ద్వార అసెంబ్లీలో సమయం వృధా అవడం తప్ప ప్రయోజనం లేదని సున్నితంగా మందలించారు. మరోవైపు ఓ సారి సడెన్‌గా రోడ్డుపై వెళుతూ తన కాన్వాయ్ ఆపి .. రోడ్డుపై ఉన్న సాధారణ వ్యక్తి ఫిర్యాదు తీసుకున్నారు. వీటితో పాటు దేవాలయాల్లో(Temples) దళితులను పూజారులుగా నియమించడం లాంటీ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ దేశంలోనే పలు పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Tamilnadu

  తదుపరి వార్తలు