Home /News /trending /

TAMIL NADU TO RETAIN STAFF THIS TECH FIRM RESORTS TO MATCHMAKING AND MARRIAGE INCREMENTS PAH

Private company: బంపర్ ఆఫర్... కంపెనీలోని ఉద్యోగులకు పెళ్లి సంబంధాలు, ప్రతి ఏడాది ఇంక్రిమెంట్స్..

కంపెనీ సీఈవో సెల్వగణేష్..

కంపెనీ సీఈవో సెల్వగణేష్..

Tamil nadu: మధురైలోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు ఇంక్రిమెంట్స్ తో పాటు, కంపెనీలో పని చేసే ఉద్యోగులకు మంచి పెళ్లి సంబంధాలను కూడా చూస్తామని ప్రకటించింది.

Madurai tech announces matchmaking and marriage increments: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దాదాపు తమ ఇళ్లలో పెళ్లిడుకు వచ్చిన వారి తల్లిదండ్రులు మంచి సంబంధాల కోసం వెతకడం చేస్తున్నారు. కొందరు తమకు తెలిసిన బంధువులు, చుట్టాలకు మంచి సంబంధం ఉంటే.. చెప్పాలని కోరుతుంటారు. మరికొంత మంది తమ పిల్లల కోసం.. మ్యాట్రిమోనిలను సంప్రదిస్తుంటారు. అయితే, దీనికి భిన్నంగా ఇక్కడోక సాఫ్ట్ వేర్ సంస్థ తమ ఉద్యోగుల కోసం తీపికబురు అందించింది. ప్రస్తుతం ఈ ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. తమిళనాడులోని మధురై లో ఉన్న శ్రీ మూకాంబికా ఇన్ఫో సోల్యుషన్స్ అనే సంస్థ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సదరు కంపెనీ ఫౌండర్, సీఈవో సెల్వగణేష్ ఉద్యోగులకు.. ఏడాదికి రెండు సార్లు ఇంక్రిమెంట్ ఇస్తామని తెలిపారు. అదే విధంగా, వీరికి సరైన సంబంధాలను చూడటానికి కంపెనీలో ప్రత్యేక విభాగంను ఏర్పాటు చేస్తామని అన్నారు. పెళ్లికి కూడా ప్రత్యేక మైన ఇంక్రిమెంట్లు ఇస్తామని అన్నారు. తమ సంస్థ 2006 లో శివకాశిలో ప్రారంభమైంది. ఆ తర్వాత.. క్రమంగా అభివ్రద్ది చెంది.. 2010 మధురైకి మార్చబడింది. ప్రస్తుతం ఈ కంపెనీ మధురైలో ఉంది.

ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని సీఈవో తెలిపారు. ఇలాంటి వెసులు బాటు కల్పించడం వలన ఉద్యోగులు ఇతర కంపెనీలకు మారాలన్న ఆలోచనలను మానుకొంటారని భావిస్తుంటారు. ఉద్యోగులకు పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఇంక్రిమెంట్స్ ఇస్తున్నామని తెలిపారు. అదే విధంగా, తమ కంపెనీలో చేరిన ఉద్యోగికి తొలిరోజు నుంచే ఫిక్స్ డ్ ఇంక్రిమెంట్స్ ఉంటాయని కూడా తెలిపింది. త

మ సంస్థలో ప్రస్తుతం 40 శాతం మంది ఉద్యోగులు సుమారు.. ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులలో పనిపట్ల నిబద్దత, కంపెనీ పట్ల గౌరవం పెరుగుతాయని,దీనితో ఉత్పాదకత పెరుగుతుందని సీఈవో సెల్వ గణేష్ అన్నారు. అదే విధంగా , తమ కంపెనీకి యూఎస్ లో క్లైంట్ లు ఉన్నారని సీఈవో తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Software, Tamil nadu, Wedding

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు