హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

లోదుస్తుల్లో రూ.15 లక్షల విలువైన బంగారం.. కస్టమ్స్ అధికారులు ఎలా పట్టుకున్నారంటే..

లోదుస్తుల్లో రూ.15 లక్షల విలువైన బంగారం.. కస్టమ్స్ అధికారులు ఎలా పట్టుకున్నారంటే..

తనిఖీ చేస్తున్న కస్టమ్స్ అధికారులు

తనిఖీ చేస్తున్న కస్టమ్స్ అధికారులు

Tamil Nadu: కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్టులో ప్రయాణికుల లగేజీలను తనిఖీ చేస్తున్నారు. ఒక వ్యక్తి కదలికలు కాస్త అనుమానస్పదంగా కన్పించాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India

విదేశాల నుంచి కొందరు బంగారం, విలువైన వస్తువులను మనం దేశంలోనికి అక్రమంగా తీసుకొస్తుంటారు. అయితే.. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులకు (Customs Offecer)  దొరక్కుండా నానా తంటాలు పడుతుంటారు. బంగారాన్ని కడుపులో పెట్టుకుని క్యారీ చేస్తుంటారు. మరికొందరు చెప్పుల అడుగు భాగంలో పేస్టుగా పెట్టుకుంటారు. ఇంకొందరు.. లోదుస్తులలో కూడా దాచుకుంటారు. ఇంకొందరు. మరీ ఘోరంగా.. మూత్ర విసర్జన, ప్రైవేటు భాగాల దగ్గర కూడా బంగారాన్ని పేస్ట్ గా, ఇతర రూపాల్లో పెట్టుకుని స్మగ్లింగ్ (Gold smuggling) చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.

కొన్నిసార్లు వీరి వాలకం చూసి అధికారులు ఇట్టే పసిగట్టేస్తారు. అక్కడ ఉండే కొన్ని పరికరాలు కూడా ప్రయాణికులు ఏదైన, విలువైన వాటిని రవాణా చేస్తే ఇట్టే పసిగట్టేస్తాయి. అవి చూపించే సిగ్నల్ లను బట్టి అధికారులు అలాంటి వారిని అదుపులోనికి తీసుకుని చెక్ చేస్తారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. తమిళనాడులోని (Tamil nadu)  తిరుచ్చిలో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఒక వ్యక్తి సింగపూర్ నుంచి తిరుచ్చి వెళ్తున్నాడు. అతడు తిరుచ్చి చేరుకున్నాక.. కస్టమ్స్ అధికారులు అతడిని చెక్ చేశారు. అక్కడి మెటల్ డిటెక్టర్ లో అతను బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు సిగ్నల్ వచ్చింది. దీంతో పోలీసులు అతడి బ్యాగును వెతికారు. ఈ క్రమంలో అతను తన డ్రాయర్ లో (Under wear)  బంగారాన్ని పేస్టుల రూపంలో అతికించాడు. ఆరకంగా బంగారంను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. దొరికిన బంగారం విలువ దాదాపు.. రూ.15 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అండర్ వేర్ లో కస్టమ్స్ అధికారులు వ్యక్తి డ్రాయర్ ను తనిఖీ చేయడంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Airport, Gold smuggling, Tamilnadu, Viral Video

ఉత్తమ కథలు