హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

మద్యం బాటిల్స్‌కు పూజలు చేసిన వ్యక్తి.. ఎందుకలా చేశాడంటే?.. Video

మద్యం బాటిల్స్‌కు పూజలు చేసిన వ్యక్తి.. ఎందుకలా చేశాడంటే?.. Video

(Image-Twitter/ANI)

(Image-Twitter/ANI)

ఓ వ్యక్తి మద్యం బాటిల్‌కు పూజలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  ఓ వ్యక్తి మద్యం బాటిల్‌కు పూజలు చేశాడు. వైన్ షాప్ తెరవగానే.. మందు బాటిల్ కొనుగోలు చేసి ఈ పూజలు నిర్వహించారు. ఈ ఘటన తమిళనాడులోని మధురై పట్టణంలో చోటుచేసుకుంది. అతడు ఇలా ఎందుకు చేశాడంటే.. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల్లో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో అతడు ఆనందంతో ఇలా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ANI వార్తా సంస్థ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఇక, జూన్ 14 నుంచి తమిళనాడులో 27 జిల్లాల్లోని టీ షాపులను తిరిగి తెరవడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మరికొన్ని సడలింపులను కూడా ఆయన ప్రకటించారు. తమిళనాడు పశ్చిమ భాగంలో ఏడు, కావేరీ డెల్టా ప్రాంతంలో నాలుగు మినహా.. మిగిలిన 27 జిల్లాల్లో కొత్త సడలింపులు వర్తించనున్నాయి. వీటిలో చెన్నై దాని పరిసర జిల్లాలు కూడా ఉన్నాయి.


  కోవిడ్-19 నేపథ్యంలో తమిళనాడులో మే 10న లాక్‌డౌన్ విధించారు. ఆ తర్వాత పలుమార్లు పొడింగించారు. అయితే 35 రోజుల విరామం తరువాత 27 జిల్లాల్లో జూన్ 14 నుంచి సెలూన్లు, పార్కులు, ప్రభుత్వ మద్యం షాపులు తిరిగి ప్రారంభించబడ్డాయి. ఈ సడలింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలను ఎయిర్ కండిషన్లు లేకుండా 50 శాతం కస్టమర్లతో సాయంత్రం 5 గంటలకు వరకూ అనుతిస్తామని ప్ర‌భుత్వం పేర్కొంది.


  జూన్ 14 నుంచి ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీ షాపులు తెరవవచ్చని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు. వేడి టీ ఇంటికి తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ సంచులకు బదులుగా పాత్రలు వాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా.. స్వీటు షాపులు ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు తెరిచేందుకు అనుమతిచ్చారు. కానీ కేవ‌లం టేక‌వే స‌ర్వీసులు మాత్ర‌మే అనుమతి ఉంటుంది. రెస్టారెంట్లు, బేక‌రీల‌కు ఇప్ప‌టికే టేక‌వే స‌ర్వీసులు మొద‌ల‌య్యాయి. నేటి నుంచి గ‌వ‌ర్న‌మెంట్ ఈ-స‌ర్వీస్ సెంట‌ర్లు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే, రాష్ట్రంలో జూన్ 21 ఉదయం వరకు లాక్‌డౌన్ పొడిగించింది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Liquor shops, Tamil nadu, Viral Video

  ఉత్తమ కథలు