టార్గెట్ 2021 ఎలక్షన్...ప్రశాంత్ కిశోర్ సేవల కోసం అన్నాడీఎంకే తహతహ...

శనివారంనాటి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం సీఎం పళనిస్వామి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శనివారం ఆయన ఢిల్లీలో ఐప్యాక్ టాప్ ఎగ్జిక్యూటివ్స్‌తో సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 14, 2019, 8:37 PM IST
టార్గెట్ 2021 ఎలక్షన్...ప్రశాంత్ కిశోర్ సేవల కోసం అన్నాడీఎంకే తహతహ...
ప్రశాంత్ కిషోర్ (File)
  • Share this:
ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించడంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కి చెందిన ఐ-ప్యాక్ సంస్థ కీలక భూమిక పోషించడం తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్రమోదీకి కీలక రాజకీయ వ్యూహకర్తగా ఆయన సేవలు అందించారు. ఆ తర్వాత 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ కోసం, 2017లో పంజాబ్ ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ కోసం ఆయన పనిచేశారు. పీకే సేవలు తమకు అక్కరకు వస్తున్నాయని భావిస్తున్న పలు పార్టీల అధినేతలు...ఆయన సేవలు తీసుకునేందుకు ఇప్పుడు క్యూకడుతున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎ మమతా బెనర్జీ కోసం ప్రశాంత్ కిశోర్ టీమ్ పనిచేసే అవకాశముందని గత వారం జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం కుదర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం శుక్రవారంనాడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా తమిళనాడు‌ సీఎం ఈ.పళనిస్వామి కూడా ప్రశాంత్ కిషోర్‌ టీమ్‌తో ఒప్పందం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికలు జరిగిన మొత్తం 38 లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్ష డీఎంకే కూటమి 37 స్థానాల్లో విజయం సాధించగా...అధికార అన్నాడీఎంకే ఒక్క స్థానానికి పరిమితమయ్యింది. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టిన అన్నాడీఎంకే...ప్రశాంత్ కిషోర్ సేవలను వాడుకుని మళ్లీ అధికార పగ్గాలు కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

శనివారంనాటి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం సీఎం పళనిస్వామి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శనివారం ఆయన ఢిల్లీలో ఐప్యాక్ టాప్ ఎగ్జిక్యూటివ్స్‌తో సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఐప్యాక్‌తో ఒప్పందం కుదుర్చుకునే అంశంపై వారితో పళనిస్వామి చర్చలు జరపనున్నారు. అయితే చర్చలు ప్రారంభదశలోనే ఉన్నాయని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎం కోసం పనిచేసే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఐ-ప్యాక్ వర్గాలు తెలిపాయి.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading