హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral news: ద్యావుడా.. షోరూంలో కాయిన్లను కుప్పగా పోసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకవుతారు..

Viral news: ద్యావుడా.. షోరూంలో కాయిన్లను కుప్పగా పోసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకవుతారు..

Tamil nadu: ఒక యువకుడు తన ఫేవరేట్ బైక్ కొనడానికి షోరూంకు వెళ్లాడు. దీనికోసం అతను మూడేళ్లు కష్టపడి వెరైటీగా డబ్బులను దాచాడు.  ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.

Tamil nadu: ఒక యువకుడు తన ఫేవరేట్ బైక్ కొనడానికి షోరూంకు వెళ్లాడు. దీనికోసం అతను మూడేళ్లు కష్టపడి వెరైటీగా డబ్బులను దాచాడు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.

Tamil nadu: ఒక యువకుడు తన ఫేవరేట్ బైక్ కొనడానికి షోరూంకు వెళ్లాడు. దీనికోసం అతను మూడేళ్లు కష్టపడి వెరైటీగా డబ్బులను దాచాడు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.

Tamil Nadu boy  Purchase new bike: తమిళనాడులో ఒక యువకుడు బైక్ ను కొనాలనుకున్నాడు. కానీ.. దాని కోసం డబ్బులను వెరైటీగా జమ చేశాడు. దీని కోసం ఏకంగా మూడేళ్లు కష్టపడ్డాడు. బైక్ కోసం ఏకంగా.. 2.6 లక్షల చిల్లరను కలెక్ట్ చేశాడు. ఈ చిల్లర 1.2 టన్నుల బరువును కలిగి ఉంది. దీన్ని లెక్కపేట్టడానికి సిబ్బందికి దాదాపు.. 10 గంటల సమయం పట్టింది. ప్రస్తుతం ఈ ఫన్నీ ఘటన తెగ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రతి రోజు కొన్ని వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగాను ఉంటాయి. నెటిజన్లు కూడా ఫన్నీ వీడియోలను చూడటానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఒక ఫన్నీ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఈ వెరైటీ ఘటన.. తమిళనాడులో చోటు చేసుకుంది. వి బూపతి అనే 29 ఏళ్ల యువకుడు స్థానికంగా కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతనికి బజాజ్ డామినర్ అంటే ఎంతో ఇష్టం. దాని కోసం దాదాపు.. 2 లక్షల ఖర్చు అవుతుందని తెలుసుకున్నాడు. కానీ అప్పుడు.. అతని దగ్గర సరిపడా డబ్బులు లేవు. దీంతో అతను.. దీనికోసం యూట్యూబ్ లో ప్రత్యేకమైన ఆల్బమ్ లు చేశాడు. ఈ క్రమంలో , డబ్బులు దాచడం మొదలు పెట్టాడు.

అయితే.. ఏదైన వెరైటీగా చేయాలను కున్నాడో ఏమో కానీ.. అతను దీని కోసం ఒక్క రూపాయి కాయిన్లను జమచేయడం ప్రారంభించాడు. కేవలం ఒక్కరూపాయి కాయిన్లనే దాచుకునే వాడు. ఎక్కడికి వెళ్లిన రూపాయి కాయిన్లను తీసుకుని జమచేస్తుండే వాడు. దీనికోసం అతను బ్యాంక్ లు, టెంపుల్స్, హోటళ్లు,టీస్టాళ్లు, చివరకు యాచకుల వద్ద కూడా కాయిన్ లు మార్చుకున్నాడు. అందరి దగ్గరకు వెళ్లి నోట్లను ఇచ్చి రూపాయి కాయిన్ లు తీసుకునే వాడు. అలా.. మూడేళ్ల పాటు కష్టపడ్డాడు. చివరకు తన దీని కోసం.. 2.6 లక్షల చిల్లరను జమచేశాడు.

దీని బరువు 1.2 టన్నులుగా ఉంది. బూపతి తన స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న.. బైక్ షోరూంకు వెళ్లాడు. షోరూం యజమానిని కలిసి తనతో పాటు తెచ్చిన కాయిన్ల మూటను కుప్పగా పోశాడు. దీన్ని చూసిన సిబ్బంది షాక్ కు గురయ్యారు. మొదట మెనెజర్ కాయిన్లను తీసుకొవడానికి నిరాకరించాడు. కానీ యువకుడు మూడేళ్ల పాటు కష్టపడ్డాడని తెలిసి, ఆశ్చర్యపోయి తర్వాత తీసుకున్నాడు.

వీటిని లెక్కించడానికి సిబ్బందికి దాదాపు.. 10 గంటల సమయం పట్టింది. చివరకు తన డ్రీమ్ బైక్ బజాజ్ డామినర్ 400 ను తన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇదేం పైత్యం.. ‘కాయిన్స్ ఇలా కలెక్ట్ చేయడం ఏంటి’.., ‘ఇదే ఆసక్తి వేరే దాంట్లో చూపిస్తే.. బాగుండు..’ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

First published:

Tags: Tamil nadu, VIRAL NEWS

ఉత్తమ కథలు