TAMIL HERO DHANUSH AND RAJINIKANTHS DAUGHTER AISHWARYA ANNOUNCES DIVORCE ON SOCIAL MEDIA SNR
మేం విడిపోతున్నాం..బ్రేకింగ్ న్యూస్ చెప్పిన తమిళ స్టార్ కపుల్
Photo Credit:Twitter
Star couple separate: వాళ్లిద్దరు విడిపోయారు. 18ఏళ్లు భార్యభర్తలుగా కలిసి జీవించిన హీరో ధనుష్, తన భార్య డైరెక్టర్ ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరి వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగూణంగా విడిగా జీవించాలని నిర్ణయించుకున్నట్లుగా ఇద్దరూ ప్రకటించారు.
తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush), ఆయన భార్య డైరెక్టర్ ఐశ్వర్య(Aishwarya)తో విడిపోయారు. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్(Twitter)వేదికగా అందరితో షేర్ చేసుకున్నారు. తమిళ(Tamil), తెలుగు(Telugu), మలయాళ(Malayalam), హిందీ (Hindi)భాషల్లోని చాలా చిత్రాల్లో నటించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు హీరో ధనుష్. సౌత్ సూపర్ స్టార్ (South super star)రజనీకాంత్(Rajinikanth) పెద్ద కుమార్తె ఐశ్వర్యను 18ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే ఇంతకాలం ఎంతో హ్యాపీగా, సాఫీగా సాగిన వారి దాంపత్య జీవితానికి స్వస్తి పలికారు. ఇద్దరి మధ్య ఉన్న వైవాహిక బంధాన్నితెగ తెంపులు చేసుకుంటున్నట్లుగా ట్వీట్లో పేర్కొన్నారు ధనుష్. గత 18ళసంవత్సరాలుగా తాను, ఐశ్వర్య స్నేహితుల్లా, భార్యభర్తల్లా, తల్లిదండుల్లా, శ్రేయోభిలాషుల్లా ఒకరికొకరం కలిసి ప్రయాణం కొనసాగించామని పేర్కొన్నారు. ఈ18ఏళ్ల తమ వైవాహిక జీవన ప్రయాణంలో ఒకరినొకరు అర్ధం చేసుకొని సర్దుకుపోయామన్నారు. కానీ ప్రస్తుతం తాము కలిసి జీవించాలని భావించడం లేదన్నారు ధనుష్. ఇద్దరం విడిపోయి వేర్వేరుగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు జీవించాలని కలిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ధనుష్. మేం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవించాలని అభిమానుల్ని కోరారు. ఈవిషయంలో తాము స్వేచ్ఛను కోరుకుంటున్నామని ట్వీట్లో పేర్కొన్నారు ధనుష్.
ధనుష్ మాటే ఐశ్వర్య మాట
హీరో ధనుష్ మాత్రమే కాదు..తాము విడిపోతున్నామనే విషయాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇద్దరు ఒకే విధమైన ప్రకటనను ఒకరు ట్విట్టర్ ద్వారా ..మరొకరు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా ఉండే ఈజంట విడిపోయారన్న వార్త రజనీకాంత్, ధనుష్ అభిమానుల్ని కొంత కలవరపెడుతోంది.
స్టార్ కపుల్ విడిపోవడంపై ఫుల్ క్లారిటీ..
రజనీకాంత్ పెద్దకుమార్తె అయిన ఐశ్వర్య రజనీకాంత్‌కి ధనుష్‌తో 2004లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఒకరు యాత్ర, మరొకరు లింగా. భర్త ధనుష్‌తో ఫస్ట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసి దర్శకురాలిగా పరిచయం అయ్యారు ఐశ్వర్య. 2012లో డైరెక్ట్ చేసిన సినిమాతోనే నేపధ్య గాయినిగా కూడా మారారు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికి ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేశాయి. ఇవాళ అవి పుకార్లు కాదని వాస్తవమే విధంగా ధనుష్, ఐశ్వర్య సోషల్ మీడియాలో తమ జాయింట్ రిలేషన్ షిప్‌ని కట్ చేసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు.
స్టార్ కపుల్ విడిపోతున్నట్లు ప్రకటించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు మంచి నిర్ణయం తీసుకున్నారని సమర్ధిస్తుంటే..మరికొందరు ఎందుకలా చేశారంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.