TAMIL DIRECTOR LOKESH KANAGARAJU NEXT FILM WITH YOUNG REBEL STAR PRABHAS NR
Prabhas - Lokesh kanagaraj: ఈ విషయం నిజమైతే ప్రభాస్ అభిమానులకు పండగే..!
Prabhas - Lokesh kanagaraj: యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియనివారు ఉండరు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ స్టార్ అయ్యాడు ప్రభాస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మారిపోయాడు.
Prabhas - Lokesh kanagaraj: యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియనివారు ఉండరు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ స్టార్ అయ్యాడు ప్రభాస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మారిపోయాడు.
Prabhas - Lokesh kanagaraj: యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియనివారు ఉండరు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ స్టార్ అయ్యాడు ప్రభాస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మారిపోయాడు. దీంతో అన్ని సినీ ఇండస్ట్రీల డైరెక్టర్లు ప్రభాస్‌తో సినిమా చెయ్యాలని ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
ఇక ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాలో, కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలా తర్వాత ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రంలో నటించనున్నారు. అయితే ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అది ఏమిటంటే ఇటీవలే మాస్టర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కానగరాజు ప్రభాస్‌తో సినిమా చేయనున్నట్టు.. ఈ సినిమాకు సంబంధించిన కథ ఇప్పటికే పూర్తయినట్టు తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. కాగా లోకేష్ కానగరాజు ప్రస్తుతం కమల్ హాసన్‌తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నారు. అయితే లోకేష్ కానగరాజు ప్రభాస్ చిత్రం పట్టాలెక్కాలంటే మూడేళ్లు పడుతుంది. మరి ఈ గ్యాప్ లో ఇంకో హీరోతో సినిమా చేయనున్నాడా లేక ప్రభాస్ కోసం మూడేళ్లు ఆగుతాడా అనేది చూడాలి. ఏది ఏమైనా ఈ విషయం నిజం అయితే ప్రభాస్ అభిమానులకు పండగ అనే చెప్పాలి.
ప్రభాస్, పూజ హెగ్డే కలిసి నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది జులై 30న అవ్వనుండగా.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది ఆగష్టు 11 న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఆతర్వాత సలార్ చిత్రం సైతం 2022 లో విడుదల అవ్వనుంది. ఇలా ఏడాదికి ఒక సినిమాతో అభిమానులను పలకరించనున్నాడు ప్రభాస్.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.