Kashmir: కోలీవుడ్‌లో చిచ్చురేపుతున్న ఆర్టికల్ 370 రద్దు

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కమల్ హాసన్ తప్పుబట్టగా...ఇప్పుడు మరో తమిళ హీరో విజయ్ సేతుపతి ‘అప్రజాస్వామిక’ నిర్ణయమంటూ మండిపడ్డారు. రజనీకాంత్ ఇప్పటికే మోదీ సర్కారు నిర్ణయాన్ని సమర్థించారు.

news18-telugu
Updated: August 13, 2019, 1:19 PM IST
Kashmir: కోలీవుడ్‌లో చిచ్చురేపుతున్న ఆర్టికల్ 370 రద్దు
రజనీకాంత్, విజయ్ సేతుపతి(ఫైల్ ఫోటోలు)
  • Share this:
జమ్ముకశ్మీర్‌కి స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం తమిళ సినీ పరిశ్రమలో చిచ్చురేపుతోంది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు మోదీ సర్కారు నిర్ణయాన్ని సమర్థిస్తుండగా...మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్...ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలను శ్రీకృష్ణార్జునులుగా అభివర్ణించడం తెలిసిందే. అటు మోదీ సర్కారు నిర్ణయాన్ని హీరో కమల హాసన్ తప్పుబట్టగా...తాజాగా మరో హీరో విజయ్ సేతుపతి వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికమని విజయ్ సేతుపతి అభిప్రాయపడ్డారు. కశ్మీరీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. మన నిర్ణయాలను మరొకరిపై బలవంతంగా రుద్దడం సరికాదని ఆస్ట్రేలియాకు చెందిన ఓ తమిళ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

విజయ్ సేతుపతి


కశ్మీర్ అంశంపై విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుండగా...మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తమ అభిమాన హీరోల అభిప్రాయాలను వారి ఫ్యాన్స్ సమర్థిస్తుండగా...మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా వారి కోలీవుడ్ సినీ హీరోల ఫ్యాన్స్ కూడా పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నారు.





విజయ్ సేతుపతి కామెంట్స్‌ని బీజేపీ మద్దతుదారులు తప్పుబడుతున్నారు.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...