హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

షాకింగ్: vijay sethupathi: విజయ్ సేతుపతిపై దాడి -వెనుక నుంచి ఎగిరి తంతే.. -video -అసలేం జరిగిందటే..

షాకింగ్: vijay sethupathi: విజయ్ సేతుపతిపై దాడి -వెనుక నుంచి ఎగిరి తంతే.. -video -అసలేం జరిగిందటే..

విజయ్ సేతుపతిపై దాడి

విజయ్ సేతుపతిపై దాడి

ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై అనూహ్యరీతిలో బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి విజయ్ సేతుపతిని వెనుక నుంచి ఎగిరి తన్నే దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. దాడి సమయంలో నటుడి పక్కనే పోలీసులు కూడా ఉన్నారు. తమిళనాడు, కర్ణాటక మధ్య వివాదాల నేపథ్యంలో దీనిపై పుకార్లు వ్యాపించాయి. కానీ అసలు విషయం ఏంటంటే..

ఇంకా చదవండి ...

ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై అనూహ్య రీతిలో దాడి జరిగింది. తమిళ సినిమాల్లో సత్తా చాటుకుని ఇప్పుడు తెలుగుతోపాటు పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులరైన విజయ్ సేతుపతిపై దాడి జరిగిందనే వార్త, దానికి సంబంధించిన వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బెంగళూరు ఎయిర్ పోర్టులో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభిమాన హీరోపై దాడి జరగడాన్ని జీర్ణించుకోలేకపోతోన్న విజయ్ సేతుపతి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..

తమిళనాడుకు చెందిన పాపులర్ నటుడు విజయ్ సేతుపతిపై మంగళవారం రాత్రి బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లి విజయ్ సేతుపతిని వెనుక నుంచి ఎగిరి తంతోన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో విజయ్ సేతుపతి పక్కనే పోలీసులు ఉన్నా దుండగుడు దాడికి పాల్పడటం, నటుడు అసహనంతో రగిలిపోతుండటం వీడియోలో కనిపించాయి. విజయ్ సేతుపతిపై దాడి జరిగింది బెంగళూరులో కావడంతో ఇది ప్రాంతీయ దురభిమానుల పనే అయి ఉంటుందని పుకార్లు రేగాయి.

తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాలు, సరిహద్దు వివాదాలు తీవ్ర స్థాయిలో ఉండటం, ఆ గొడవలు సినీ రంగానికి కూడా అంటుకుని, తమిళ నటులపై కర్ణాటకలో, కన్నడ నటులపై తమిళనాడులో దాడులు సైతం జరిగిన ఉదంతాలుండటం తెలిసిందే. రెండు రాష్ట్రాల నటులు ఎంతటి తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే.. ఇటీవల కన్నడ పవన్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణిస్తే.. తెలుగు నటులు దాదాపు అందరూ బెంగళూరు వెళ్లి నివాళులు అర్పించగా, తమిళనాడు నుంచి కనీసం ఒక్కరంటే ఒక్క నటుడు కూడా పునీత్ కు నేరుగా నివాళి అర్పించలేని పరిస్థితి. ఈ క్రమంలోనే బెంగళూరులో విజయ్ సేతుపతిపై దాడి సర్వత్రా కలకలం రేపింది. కానీ..

విజయ్ సేతుపతిపై దాడిలో రాష్ట్రాల వివాదం కోణం లేదని తెలుస్తోంది. బెంగళూరు ఎయిర్ పోర్టులో ఘటన జరిగినప్పుడు చూసిన, విజయ్ సేతుపతితో కలిసి ప్రయాణించిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పేర్కొన్న అంశాలను బట్టి.. దాడికి పాల్పడిన వ్యక్తి విజయ్ సేతుపతి సహప్రయాణికుడట. ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి అసిస్టెంట్ చేయి తాకడంతో ఆ ప్రయాణికుడు గొడవకు దిగడం, ఇద్దరి వాగ్వాదం జరగ్గా, వాళ్లను విడదీసేందుకు విజయ్ సేతుపతి ప్రయత్నించారట. అంతలోపే పోలుసు సైతం దగ్గరికొచ్చి, విజయ్ సేతుపతి అసిస్టెంట్, గొడవకు దిగిన ప్రయాణికుడికి సర్దిచెప్పి పంపేశారట. కానీ ఆ వ్యక్తి కోపంతో ఈసారి విజయ్ సేతుపతిపైకే దాడికి దిగడంతో పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. చివరికి క్షమాపణలతో వ్యవహారం ముగిసినట్లు తెలుస్తోంది..

First published:

Tags: Airport, Attack, Bengaluru, Karnataka, Puneeth RajKumar, Tamil nadu, Vijay Sethupathi

ఉత్తమ కథలు