Talkative Dinosaur: మెక్సికోలో డైనోసర్​ అవశేషాలు.. ఇవి ఇతర జంతువులతో మాట్లాడేవట!

Talkative Dinosaur: మెక్సికోలో డైనోసర్​ అవశేషాలు.. ఇవి ఇతర జంతువులతో మాట్లాడేవట!

Instagram image

ఇవి డైనోసర్లలోనే అరుదైన జాతులని, వీటిని తలాటోలోఫస్ గలోరం అని పిలుస్తారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శిఖరం ఆకారంలో ఉండే ఈ డైనోసర్లకు ఇతర జంతువులతో కమ్యూనికేట్​ చేయగలిగే జ్ఞానం ఉండేదని, ఇవి మాట్లాడగలవని పాలియోంటాలజిస్టులు అభిప్రాయపడ్డారు.

  • Share this:
కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమండలంపై తిరగాడిన భారీ జీవజాతి ఏదైనా ఉందంటే అది డైనోసర్​ మాత్రమేనని అనేక పరిశోధనల్లో తేలింది. అప్పుడపపుడు తవ్వకాల్లో అనేక డైనోసర్​ జాతుల అవశేషాలు బయటపడుతుంటాయి. ఇలాంటి అవశేషాలనే 2013లో మెక్సికోలో గుర్తించారు పాలియోంటాలజిస్టులు. దాదాపు 10 సంవత్సరాల నుంచి వీటిపై పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధనలో తేలిన కొన్ని ఆసక్తికర విషయాలను వారు వెల్లడించారు. ఇవి 73 మిలియన్ సంవత్సరాల కింది డైనోసర్లని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అంతేకాదు, ఇవి డైనోసర్లలోనే అరుదైన జాతులని, వీటిని తలాటోలోఫస్ గలోరం అని పిలుస్తారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శిఖరం ఆకారంలో ఉండే ఈ డైనోసర్లకు ఇతర జంతువులతో కమ్యూనికేట్​ చేయగలిగే జ్ఞానం ఉండేదని, ఇవి మాట్లాడగలవని పాలియోంటాలజిస్టులు అభిప్రాయపడ్డారు.

2013 సంవత్సరం నుంచి నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ (INAH), నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో (UNAM) పరిశోధకులు ఈ డైనోసర్​ అవశేషాలపై పరిశోధన చేస్తున్నారు. కాగా, ఈ పరిశోధనకు అధ్యయనం వహించిన అలెజాండ్రో రామెరెజ్ మాట్లాడుతూ " ఈ డైనోసార్ తోక మొట్టమొదటగా కోహుయిలా రాష్ట్రంలో గుర్తించాం. అదే చోట తవ్వకాలు ప్రారంభించగా.. ఎముక, తల, మొండెం వంటి ఇతర ఎముకలను కనుగొన్నాం. మిలియన్ల సంవత్సరాల క్రితం కోహైలా ఒక ఉష్ణమండల ప్రాంతంగా ఉండేది. అందువల్ల, ఈ ప్రాంతంలో డైనోసర్ల సంచారం ఎక్కువగా ఉండేదని భావిస్తున్నాం.’’ అని ఆయన తెలిపారు. కాగా, ఈ పరిశోధనా ఫలితాలు క్రెటేషియస్ రీసెర్చ్ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురించబడ్డాయి. కాగా, ఈ ఆవిష్కరణ పాలియోంటాలజీ చరిత్రలోనే "అసాధారణమైన కేసు"గా INAH అభివర్ణించింది.

డైనోసర్లు మాట్లాడేవా?
పాలియోంటాలజిస్టుల తవ్వకాల్లో బయటపడ్డ డైనోసార్లు శాకాహార జంతువులని, ఇవి సుమారు 72 లేదా 73 మిలియన్ సంవత్సరాల క్రితానికి చెందినవని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ఈ జాతి డైనోసర్లను తలాటోలోఫస్ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తున్నారు. తలాటోలోఫస్​ అనే పదం స్వదేశీ మెక్సికన్ భాషలోని నహుఅట్​, గ్రీకు పదం "ఛాతీ" నుండి ఉద్భవించింది. గలోరం అనేది పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు సూచించిన పేరు నిండి తీసుకొబడింది. ఇక, ఈ డైనోసార్లలో తక్కువ -ఫ్రీక్వెన్సీ శబ్దాలు వినగలగే చెవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కాబట్టి, అవి మాట్లాడే డైనోసార్లు అయి ఉంటాయని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ణారించారు. ఇతర జంతువులను బయపెట్టడానికి ఇవి బిగ్గరగా శబ్ధాలు చేస్తూ అరిచేవని పాలియోంటాలజిస్టులు అభిప్రాయపడ్డారు.
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు