TALIBAN ORDERS AFGHAN SHOPKEEPERS TO BEHEAD MANNEQUINS IN A VIRAL VIDEO MKS
Shocking: ఆడ బొమ్మల తలల్ని అడ్డంగా నరకండి.. Taliban హుకుం: viral video
బొమ్మల తలలు నరికేస్తోన్న తాలిబన్
అఫ్గాన్ లో అడుగడుగునా షరియత్ చట్టాలను కఠినంగా అమలు చేస్తోన్న తాలిబన్ల కన్ను ఇప్పుడు మెనిక్వీన్స్(బొమ్మల)పై పడింది. వస్త్ర దుకాణాల్లో దుకాణాల్లో కనిపించే బొమ్మలు( మెనిక్వీన్స్ mannequins)ను తాలిబన్లు అనుమతించడం లేదు. ఇప్పటిదాకా ఉన్నవాటిని నాశనం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలివి..
ఓ వైపేమో, మేం మారిపోయాం.. మాకు సాయం చేయండండని ప్రపంచ దేశాలను వేడుకుంటారు. మరోవైపేమో, మాయదారిదైనా మాదారి మాదేనంటూ వింత పోకడలో రోజుకో మెట్టెక్కెతుంటారు. అవును, మనం మాట్లాడుతోంది తలతిక్క తాలిబన్ల గురించే. అఫ్గానిస్థాన్ ను కైవసం చేసుకున్న తర్వాత దేశం పేరును సైతం మార్చేసిన తాలిబన్లు.. అడుగడుగునా షరియత్ చట్టాల అమలును మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి చూపు బొమ్మలపై పడింది. రెడీ మేడ్ దుస్తుల మోడల్స్ ను తెలిపేలా దుకాణాల్లో కనిపించే బొమ్మలు( మెనిక్వీన్స్ mannequins)ను తాలిబన్లు అనుమతించడం లేదు..
అఫ్గాన్ పై పట్టు సాధించిన కొద్ది రోజులకే దేశంలోని వివిధ ప్రాంతాల్లో తమకు వ్యతిరేక గుర్తులుగా నిలిచే విగ్రహాలు, కట్టడాలను కూల్చేశారు తాలిబన్లు. ఇప్పుడు బట్టల షోరూమ్స్ లో బొమ్మలను సైతం ఉంచొద్దని హుకుం జారీ చేశారు. ఆయా దుకాణాల్లో ఇప్పటికే ఉన్న మెనిక్వీన్స్ తలలను అడ్డంగా కోసేయాలంటూ రేడీమేడ్ షాపుల యజమానులను తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది.
బట్టల షాపుల వ్యాపారులు గనుక స్వచ్చందంగా తమ దగ్గరున్న మెనీక్వీన్ బొమ్మలను వెంటనే నాశనం చేయకుంటే ప్రభుత్వ సైనికులే రంగంలోకి దిగి వాటిని కాల్చిపారేస్తామని కూడా తాలిబన్లు హెచ్చరిక జారీ చేశారు. దీంతో వస్త్ర దుకాణాల యజమానులు లబోదిబోమంటూ పాలకుల కాళ్లపై పడ్డారు. తమ దగ్గరున్న బొమ్మలు చాలా ఖరీదైనవని, వాటిని పూర్తిగా నాశనం చేస్తే భారీగా నష్టం వాటిల్లుతుందని కొందరు దుకాణదారులు స్థానిక తాలిబన్ నేతలకు విన్నవించుకున్నారు. అప్పుడు..
The Taliban have banned female mannequins with a head so these people who sell dresses had to behead them all. pic.twitter.com/67FBr3dUPX
దుకాణదారుల రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకుని బొమ్మల విషయంలో కొన్ని సడలింపులు కల్పించామని, మెనీక్వీన్స్ లను మొత్తంగా నాశనం చేసేబదులు, తలలు మాత్రమే తొలగిస్తే సరిపోతుందని సవరణ ఆదేశాలిచ్చామని మంత్రి షేక్ అజీజ్-ఉ-రెహమాన్ వెల్లడించారు. పలు దుకాణాల్లో మెనీక్వీన్స్ తలలను అడ్డంగా కోసేస్తోన్న వీడియోలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.