హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Talented Boy: అదరగొట్టిన బుడ్డోడు.. ట్యాలెంట్ మాములుగా లేదుగా.. ఈ వీడియో చూసేయండి..

Talented Boy: అదరగొట్టిన బుడ్డోడు.. ట్యాలెంట్ మాములుగా లేదుగా.. ఈ వీడియో చూసేయండి..

ట్యాలెంట్‌తో అదరగొడుతున్న బాలుడు

ట్యాలెంట్‌తో అదరగొడుతున్న బాలుడు

కళ్లు మూసుకుని పిల్లాడి మిమిక్రీని వింటే.. అతడు అనుకరించే జంతువులు/పక్షులు మన పక్కనే నిజంగా ఉన్నాయా అనే అనుభూతి కలుగుతుంది.

కొందరు పిల్లలు చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తారు. అయితే అటువంటి వారిలో అతి కొద్ది మందిని మాత్రమే ప్రపంచం గుర్తించిందనే చెప్పాలి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రాచుర్యం పెరగడంతో.. ట్యాలెంట్ ఉన్న చాలా మంది పిల్లలు వెలుగులోకి వస్తున్నారు. అయితే వారిలో కొందరి వీడియోలు పాపులర్ అవుతున్నప్పటికీ.. వారి పూర్తి వివరాలు తెలియకపోవడం ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి. తాజాగా ఓ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ అతని ట్యాలెంట్ ఏమిటంటే.. అతను పక్షులు, జంతువుల శబ్దాలను ఇట్టే అనుకరిస్తాడు. పేరు చెప్పగానే.. వాటి వాయిస్ అచ్చు గుద్దినట్టు దించేస్తున్నాడు.

కళ్లు మూసుకుని అతని మిమిక్రీని వింటే.. అతడు అనుకరించే జంతువులు/పక్షులు మన పక్కనే నిజంగా ఉన్నాయా అనే అనుభూతి కలుగుతుంది. Svideo ఫేస్‌బుక్‌లో అకౌంట్ నుంచి షేర్ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటివరకు 1.8 మిలియన్ లైక్స్ వచ్చాయి. 19 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. అంటే ఆ వీడియో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ వీడియోలో పిల్ల మధ్య నిల్చున్న బాలుడు.. పక్కన ఉన్నవారు పక్షులు, జంతువుల పేర్లు చెబుతూంటే వాటి వాయిస్‌ను చాలా సులువుగా అనుకరించాడు. అచ్చు గుద్దినట్టుగా వాయిస్‌లను దించేశాడు. ఈ బడ్డోడి ట్యాలెంట్ చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అతనికి ప్రశంసిస్తూ, అభినందనలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ పిల్లాడు ఎవరూ, ఏ ప్రాంతానికి చెందినవాడు అనే వివరాలు మాత్రం తెలియలేదు.

First published:

Tags: School boy, Viral Video

ఉత్తమ కథలు