తాజ్‌ మహల్ సందర్శకులకు చేదు వార్త.. 3 గంటల కన్నా ఎక్కువ సేపు అక్కడే ఉంటే..

Taj Mahal: తాజ్ మహల్ వద్ద మూడు గంటలకు పైగా ఉంటే వారికి జరిమానా విధించాలని ఆగ్రా పురావస్తు శాఖ అధికారులు తాజాగా నిర్ణయించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 12, 2019, 3:01 PM IST
తాజ్‌ మహల్ సందర్శకులకు చేదు వార్త.. 3 గంటల కన్నా ఎక్కువ సేపు అక్కడే ఉంటే..
తాజ్ మహాల్ కట్టడం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 12, 2019, 3:01 PM IST
తాజ్ మహల్.. ప్రేమకు గుర్తు.. ప్రేమ పక్షులు ఇష్టపడే పాలరాతి సౌధం.. 17వ శతాబ్దంలో షాజహాన్ తన ముద్దుల రాణి ముంతాజ్ కోసం నిర్మించిన ఈ కట్టడం.. మహాద్భుతం. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఇదొకటి. అయితే, ఈ పురాతన కట్టడాన్ని సందర్శించాలనుకునే వారికి అధికారులు చేదు వార్త చెప్పారు. అక్కడ మూడు గంటలకు పైగా ఉంటే వారికి జరిమానా విధించాలని ఆగ్రా పురావస్తు శాఖ అధికారులు తాజాగా నిర్ణయించారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ సందర్శకులను నియంత్రించడానికి వీలుగా 14 గేట్లను ఏర్పాటు చేశారు. ఆగ్రా నగరంలోని తాజ్‌మహల్ సందర్శకులు లోపలకు వచ్చిన తర్వాత కేవలం మూడు గంటలపాటు మాత్రమే అనుమతిస్తారు. తాజ్ వద్ద అధిక సమయం ఉంటే వారికి ఎగ్జిట్ గేటు వద్ద జరిమానా విధించాలని నిర్ణయించినట్లు ఆగ్రా పురావస్తు శాఖ సూపరింటెండెంట్ వసంత్ స్వరాంకర్ చెప్పారు.

తాజ్‌మహల్ పరిరక్షణను పరిగణనలోకి తీసుకొని పురావస్తు శాఖ అధికారులు సందర్శకులను నియంత్రించేందుకు మూడు గంటల సమయం నిబంధనను తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ కట్టడం కాలుష్య కోరల్లో చిక్కుకొని నరకం అనుభవిస్తోంది. తెల్లని తెల్లని బండరాళ్లు రంగు మారిపోతున్నాయి. శ్యామవర్ణ ఆకాశం కింద.. వెండి మబ్బుల మధ్య.. శ్వేతవర్ణంతో ప్రకాశిస్తున్న ఈ ప్రేమ గురుతు.. ఇప్పుడు మసకబారుతోంది.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...