మింగేసిన ఎయిర్ పాడ్ బాత్రూమ్ ద్వారా బయటకు.. చెక్ చేసిన యువకుడు షాక్..

వైద్యులు ఎక్స్‌రే తీయడంతో అసలు విషయం తెలిసింది. అయితే, దాన్ని బయటకు తీయకుండా.. తర్వాత రోజు ఉదయం బాత్రూమ్‌కి వెళ్లినప్పుడు చెక్ చేయమని సూచించారు.

news18-telugu
Updated: May 4, 2019, 9:02 PM IST
మింగేసిన ఎయిర్ పాడ్ బాత్రూమ్ ద్వారా బయటకు.. చెక్ చేసిన యువకుడు షాక్..
యాపిల్ ఎయిర్ పాడ్స్ (ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇది టెక్నాలజీ యుగం. ప్రతిక్షణం టెక్నాలజీని అంటిపెట్టుకుని ఉంటున్నాం. చివరకు నిద్రపోయేటప్పుడు కూడా టెక్నాలజీని మనం వినియోగించుకుంటున్నాం. అలాగే, తైవాన్‌లో కూడా ఓ యువకుడు నిద్రపోయేటప్పుడు తన ఎయిర్‌పాడ్స్ చెవిలో పెట్టుకుని పడుకున్నాడు. నిద్రలేచి చూసేసరికి ఒకటే ఎయిర్‌పాడ్ ఉంది. మరోటి కనిపించలేదు. అంతా చెక్ చేశాడు. ఎక్కడా దొరకలేదు. దీంతో ‘Find my Airpod’ యాప్ ద్వారా తన ఎయిర్‌పాడ్ కోసం వెతికాడు. అందులో చెక్ చేస్తే అది తన రూమ్‌లోనే ఉన్నట్టు చూపించింది. దీంతో ఇల్లుమొత్తం గాలించాడు. బెడ్ షీట్లు తీసేసి, మంచం కింద, బీరువాలు, సోఫాలు, ఇంటి నలుమూలలా గాలించాడు. అయినా దొరకలేదు. కానీ, యాప్‌లో మాత్రం ఇంకా అది రూమ్‌లోనే ఉన్నట్టు చూపించింది. దీంతో తాను మింగేసి ఉంటానని అతడు గ్రహించాడు.

ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించిన ఆ యువకుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాడు. వైద్యులు ఎక్స్‌రే తీయడంతో అసలు విషయం తెలిసింది. అయితే, దాన్ని బయటకు తీయకుండా.. తర్వాత రోజు ఉదయం బాత్రూమ్‌కి వెళ్లినప్పుడు చెక్ చేయమని సూచించారు. దీంతో తర్వాత రోజు ఆ యువకుడు బాత్రూమ్‌‌కి వెళ్లిన సమయంలో ఆ ఎయిర్‌పాడ్ కూడా బయటకు వచ్చేసింది.


దాన్ని ఆ యువకుడు శుభ్రంగా శుభ్రం చేసి మళ్లీ చెవిలో పెట్టుకుని చెక్ చేశాడు. విచిత్రంగా సుమారు 24 గంటల తర్వాత కూడా అది పనిచేస్తుంది. ఎయిర్ పాడ్స్ వాటర్ ప్రూఫ్ అని ఆపిల్ సంస్థ ఎక్కడా ప్రకటించలేదు. అయితే, 24 గంటల పాటు తన కడుపులో ఉన్న ఆ ఎయిర్‌పాడ్స్ ఆ తర్వాత కూడా పనిచేయడం అతడికి విచిత్రంగా అనిపించింది. అందులో 41శాతం బ్యాటరీ కూడా ఉందట. అయితే, బాత్రూమ్‌లో నుంచి తీసి మళ్లీ చెవిలో ఎందుకు పెట్టుకున్నాడనే డౌట్ మీకు వస్తుందా? అందరికీ వస్తుంది.
First published: May 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు