హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

తైవాన్ లో భారీ భూకంపం.. బొమ్మలా మాదిరిగా వణికిన రైళ్లు.. వైరల్ గా మారిన వీడియో..

తైవాన్ లో భారీ భూకంపం.. బొమ్మలా మాదిరిగా వణికిన రైళ్లు.. వైరల్ గా మారిన వీడియో..

కదులుతున్న రైలు

కదులుతున్న రైలు

Taiwan Earthquake: తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావానికి ప్లాట్ ఫామ్ మీద ఆగి ఉన్న ట్రైన్ టాయ్ బొమ్మల్లా వణికిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

తైవాన్ లోని (Taiwan Earthquake) ఆగ్నేయ తీరంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద 6.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. భారీ భూకంపం కారణంగా ఆ ప్రాంతంలోనే అనేక భవానాలు పేకమేడల్లా కదిలిపోయాయి. దీంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా భూకంపం సంభవించినప్పుడు ప్లాట్ ఫామ్ మీద ఉన్న ఒకరైలు టాయ్ బొమ్మలా వణికిపోయింది. కొంత మంది భయంతో అక్కడ ఏంజరుగుతుందో అర్థం కాక.. అక్కడే నక్కి చూస్తు ఉండిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చైనా తూర్పు తీరంలో స్వయం ప్రతిపత్తి కలిగిన తైవాన్(Taiwan) ద్వీపంలో ఆదివారం మరోసారి బలమైన భూకంపం(Earthquake) సంభవించింది. తైవాన్‌లోని యుజింగ్ నగరంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. తైవాన్‌లోని యుజింగ్‌కు తూర్పున 85 కిలోమీటర్ల దూరంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:14 గంటలకు భూకంపం సంభవించిందని USGS(యూఎస్ జియోలాజికల్ సర్వే) తెలిపింది. ప్రారంభంలో భూకంప తీవ్రత 7.2గా ఇవ్వబడింది, అయితే USGS దానిని తర్వాత 6.9కి మార్చింది. అయితే శనివారం అదే ప్రాంతంలో తక్కువ నష్టంతో అనేక సార్లు ప్రకంపనలు వచ్చాయి.

అదే ప్రాంతంలో 24గంటల్లో 12సార్లు భూమి కంపించింది. శనివారం అదే ప్రాంతంలో 6.5 తీవ్రతతో కూడా భూకంపం వచ్చిందని,24 గంటల్లోనే మళ్లీ అదే తీవ్రతతో ఇవాళ భూకంపం వచ్చినట్లు USGS తెలిపింది. కానీ ఆదివారం నాటి భూకంపం మరింత బలంగా ఉందని తెలిపింది. భారీ భూకంపం రావడంతో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద అపార్టమెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. రాజధాని తైపీలో కూడా ప్రకంపనలు సంభవించాయి. తైవాన్ మీడియా ప్రకారం, భూకంప కేంద్రానికి సమీపంలో రెండు అంతస్తుల నివాస భవనం కూలిపోయింది. రాజధాని తైపీలోని ద్వీపం యొక్క ఉత్తర చివరలో కూడా ప్రకంపనలు సంభవించాయి.

తైవాన్‌లో భూకంపం సంభవించిన తర్వాత  జపాన్(Japan) వాతావరణ సంస్థ...తైవాన్ సమీపంలోని మారుమూల దీవులకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు బీచ్‌కు దూరంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. సాయంత్రం 4 గంటల వరకు ఒక మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తైవాన్‌కు తూర్పున 110 కిలోమీటర్లు (70 మైళ్లు) తూర్పున 4:10 గంటలకు జపాన్‌లోని పశ్చిమ ద్వీపమైన యోనాగుని ద్వీపానికి తొలి అలలు చేరుకోవచ్చని ఏజెన్సీ తెలిపింది. ఆ తర్వాత సమీపంలోని మూడు ద్వీపాల్లో అలలు ఎగసిపడే అవకాశముందని తెలిపింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Earthquake, Japan, Taiwan, Viral Video

ఉత్తమ కథలు