‘గే’లకు అక్కడ పండగే.. పెళ్లి చేసుకోవాలనుకుంటే అడ్డు చెప్పేవారే ఉండరు..

ప్రతీకాత్మక చిత్రం (Photo: Priyam Malhotra)

స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి దేశంగా డెన్మార్క్‌ నిలిచింది. ఆ తరువాత నార్వే, స్వీడన్‌, ఐలాండ్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు అనుమతి ఇస్తూ వచ్చాయి. తాజాగా, స్వలింగ సంపర్కుల వివాహానికి తైవాన్ అనుమతి ఇచ్చింది.

  • Share this:
    స్వలింగ సంపర్కం.. ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధము. ప్రపంచ వ్యాప్తంగా గే, లెస్బియన్ కల్చర్ బాగా పెరుగుతోంది. స్వలింగ సంపర్కులు బహిరంగంగానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ స్వలింగ వివాహాలకు కొన్ని దేశాలు ఒప్పుకుంటున్నాయి కూడా. భారత్ వంటి సంప్రదాయ దేశాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్వలింగ వివాహలంటేనే భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శకుల వాదన. అయితే, దీన్ని చట్టబద్ధం చేసిన తొలి దేశంగా డెన్మార్క్‌ నిలిచింది. ఆ తరువాత నార్వే, స్వీడన్‌, ఐలాండ్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు అనుమతి ఇస్తూ వచ్చాయి. తాజాగా, స్వలింగ సంపర్కుల వివాహానికి తైవాన్ అనుమతి ఇచ్చింది. ఇకనుంచి అక్కడ గే, లెస్బియన్లు పెళ్లి చేసుకోవాలనుకుంటే అడ్డు చెప్పేవారే ఉండరు. ఆసియాలోనే ఇలా గే వివాహాలకు అనుమతి ఇస్తున్న తొలి దేశంగా తైవాన్ నిలిచింది. దీనికి సంబంధించిన బిల్లును ఈ రోజు తైవాన్ పార్లమెంటు ఆమోదించింది.

    రెండేళ్ల క్రితం అక్కడి సుప్రీం కోర్టు గే పెళ్లిళ్లకు సంబంధించి తగిన మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే 24, 2019కి డెడ్‌లైన్ విధించింది. దీంతో డెడ్‌లైన్ ముగిసే కాలం దగ్గర పడటంతో పార్లమెంటు ఈ రోజు సమావేశమై బిల్లును ఆమోదించింది. ఈ సందర్భంగా పార్లమెంటు బయట వేలాది మంది గేలు, లెస్బియన్లు సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు అనుకూల నినాదాలు చేశారు.
    First published: