Home /News /trending /

SWIGGY DELIVERY BOY RIDES HORSE TO DROP OFF FOOD PACKAGES AMID HEAVY RAIN IN MUMBAI PAH

వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. గుర్రం మీద స్వారీ చేస్తు ఫుడ్ డెలివరీ.. కారణం అదే..

గుర్రం మీద ఫుడ్ డెలివరీ

గుర్రం మీద ఫుడ్ డెలివరీ

Mumbai: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంబై నగరం అతలాకుతలంగా మారింది. ప్రజల జీవనం పూర్తిగా స్తంభించి పోయింది. ఈ క్రమంలో.. ఒక అంతటి భారీ వర్షం లోను ఫుడ్ డెలివరీ బాయ్ చేసి పని నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai)  భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే అక్కడి లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఎక్కడ చూసిన రోడ్లంతా నీళ్లతో నిండిపోయి కన్పిస్తున్నాయి. వాహనాలు రోడ్డు మీద ప్రయాణించలేని పరిస్థితులు సంభవించాయి. అయితే, మనం వర్షం (heavy rains) పడినప్పుడు బయటిఫుడ్ తినాలని పిస్తుంది. చాలా మంది అలాంటి సమయంలో.. రుచికరమైన, స్పైసీ ఫుడ్ లను ఆర్డర్ పెడుతుంటారు.

అయితే, డెలివరీ బాయ్స్ లు (Food delivery) తరచుగా బైక్ లు, ఇతర వాహనాలలో ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. మరికొన్ని చోట్ల.. కార్లలో కూడా ఫుడ్ డెలివరీ చేసిన సంఘటనలు మనం చూశాం. అయితే, ఇక్కడ ఒక వ్యక్తి వెరైటీగా గుర్రం మీద వెళ్లి తన ఆర్డర్ ను డెలివరీ చేయడానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media)  వైరల్ గా మారింది.



పూర్తి వివరాలు.. కొన్ని రోజులుగా ముంబైలో కుండపోతగా వర్షం కురుస్తుంది. అప్పుడు కొంత మంది స్విగ్గీలో ఫుడ్ కోసం (Swiggy food)  ఆర్డర్ పెట్టారు. ఈ క్రమంలో.. అక్కడ రోడ్డంతా జలమయమై ఉంది. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్.. ఫుడ్ డెలివరీ చేయడానికి గుర్రం మీద వెళ్లాడు. అతను.. వర్షపు నీటిలోను.. గుర్రం మీద రోడ్డుపై ప్రయాణిస్తున్నాడు. ఈ వీడియో (viral video)  ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.



దీన్ని చూసిన నెటిజన్లు.. డెడికేషన్ అంటే ఇది.., ఏమన్నా ఐడియానా.., డెలివరీ బాయ్ ఆర్డర్ ను కొంచెం సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నాడంటూ కామెంట్ లు పెడుతున్నారు. ఇప్పటికే ముంబైలోని చాలా ప్రాంతాలు వర్షం నీళ్లతో నిండిపోయాయి. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం ఆరెంజ్ అలెర్ట్ ను కూడా ప్రకటించింది. కల్బాదేవి, సియోన్ ప్రాంతాల్లో అనేక భవనాలు కూలిపోయాయి.

ఇదిలా ఉండగా స్పైస్‌ జెట్ (Spicejet) విమానంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

దీంతో ప్రయాణికులు ఊపిరి అందక ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ నుంచి జబల్‌పూర్ (Delhi to Jabalpur)  వెళ్లడానికి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలోని ప్రయాణికుల క్యాబిన్‌లో పొగలు వ్యాపించాయి. దీన్నిఅధికారులు, ఎయిర్ హోస్టేస్ సిబ్బంది గమనించారు. అప్పుడు విమానం.. భూమి నుంచి దాదాపు.. 5,000 అడుగుల ఎత్తులో ఉంది. దీంతో అధికారులు వెంటనే ఢిల్లీలోని విమాన సిబ్బందికి సమాచారం అందించారు. విమానం తిరిగి రన్ వే మీద చేరడానికి ఎయిర్ ట్రాఫిక్ ను అధికారులు క్లియర్ చేశారు.

ఈ క్రమంలో.. జబల్‌పూర్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ (SpiceJet Flight) విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. క్యాబిన్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు గాలి పీల్చుకొవడానికి తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించి వీడియోలో.. ఫ్లైట్‌లోని ప్రయాణికుల క్యాబిన్ పొగతో నిండి ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Heavy Rains, Mumbai, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు