యువతికి మాస్క్ తొడిగిన హంస... కరోనా ఉందని వార్నింగ్... వైరల్ వీడియో

Viral Video: హంస మాస్క్ తొడగడమేంటి? అలా ఎక్కడైనా జరుగుతుందా అని అనిపించవచ్చు. అలా జరిగింది కాబట్టే ఇది న్యూస్ అయ్యింది. ఆ వైరల్ వీడియో విశేషం తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 14, 2020, 12:08 PM IST
యువతికి మాస్క్ తొడిగిన హంస... కరోనా ఉందని వార్నింగ్... వైరల్ వీడియో
యువతికి మాస్క్ తొడిగిన హంస... కరోనా ఉందని వార్నింగ్... వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
Viral Video: ఇంటర్నె్ట్‌లో అప్పుడప్పుడూ అదిరిపోయే వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలాంటి వీడియో ఇప్పుడొకటి వైరల్ అయ్యింది. అది చూసిన వాళ్లంతా నవ్వుతున్నారు. భలే భలే అంటున్నారు. ఎందుకంటే... కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దనే సందేశం ఇస్తోంది ఆ వీడియో. మనం మనుషులం కాబట్టి... మాస్కు పెట్టుకోండి... సోషల్ డిస్టాన్స్ పాటించండి అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ వీడియోలో ఓ హంస... మాస్క్ పెట్టుకోమని హెచ్చరించింది. హంసను చూసేందుకు వెళ్లిన యువతి దగ్గరకు వచ్చిన హంస... ముందుగా... ఆమె మాస్క్ ధరించి... దాన్ని దవడ కింద ఉంచుకోవడాన్ని చూసింది. వెంటన హంస... తన ముక్కుతో... మాస్కును దవడ కింద నుంచి లాగి... సరిగ్గా ముక్కు, నోరూ మూసుకునేలా వదిలింది. ఆశ్చర్యపోయిన మహిళ... ఒక్కసారిగా వెనక్కి పడింది. అదీ ఈ వీడియోలో దృశ్యం. ఇది అందరికీ తెగ నచ్చుతోంది.


ఈ వీడియోని వెనమ్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ ఘటనలో యువతికి పెద్దగా గాయాలేవీ కాలేదని తెలిసింది. ఐతే... హంస అలా చెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జనరల్‌గా మనుషుల దగ్గరకు పక్షులు రావు. ఈ రోజుల్లో ఈజీగా వచ్చేస్తూ... మనుషులపైనే ఎదురు తిరుగుతున్నాయి. ఈమధ్యే ఓ పెద్దాయనకు హంస షాక్ ఇచ్చింది. కంచెలో ఇరుక్కుపోయిన హంస పిల్లను కాపాడేందుకు ముసలాయన ట్రై చేస్తుంటే... దాన్ని అర్థం చేసుకోని హంస... ఆయనపైనే దాడి చేసింది. అది చూసిన వాళ్లంతా అయ్యో పాపం అన్నారు. అది కింది వీడియో.


మొత్తానికి కరోనా కాలంలో ఇలాటి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. అప్పుడే కరోనా వదిలేలా కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వమైతే మరో ఆరు నెలల దాకా వ్యాక్సిన్ చేతికి రాదంటోంది. అంటే అప్పటి వరకూ మనం ఇలాగే ఇబ్బందులు, కష్టాలూ పడాలా అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: September 14, 2020, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading