Home /News /trending /

SUSPECTED OF LEAKING COVID 19 WUHAN INSTITUTE OF VIROLOGY HAS BEEN NOMINATED BY FOR ONE OF THE TOP SCIENCE AWARDS IN CHINA SAYS REPORT GH SRD

Wuhan Lab: ఇదేమీ విడ్డూరం..వుహాన్ ల్యాబ్​కు చైనా టాప్ సైన్స్ అవార్డు​​..కరోనా కట్టడికి విశేషమైన కృషి చేసినందుకట!

Photo Credit : Getty

Photo Credit : Getty

Wuhan Lab: ఓవైపు కరోనా వైరస్​ చైనాలోని వుహాన్​ ల్యాబ్ నుంచే లీకైందని అంతర్జాతీయ సమాజం అనుమానం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు, చైనా మాత్రం ఇవేవీ పట్టనట్టు ప్రవర్తిస్తోంది. వార్తల్లో నిలిచిన ప్రతిసారి వుహాన్​ ల్యాబొరేటరీస్​ను ఆ దేశం వెనకేసుకొస్తుంది.

ఇంకా చదవండి ...
ఓవైపు కరోనా వైరస్​ చైనాలోని వుహాన్​ ల్యాబ్ నుంచే లీకైందని అంతర్జాతీయ సమాజం అనుమానం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు, చైనా మాత్రం ఇవేవీ పట్టనట్టు ప్రవర్తిస్తోంది. వార్తల్లో నిలిచిన ప్రతిసారి వుహాన్​ ల్యాబొరేటరీస్​ను ఆ దేశం వెనకేసుకొస్తుంది. తాజాగా చైనాలోనే అత్యంత టాప్ సైన్స్ అవార్డుల్లో ఒకటిగా పరిగణించే సైన్స్ అండ్ టెక్నాలజీ అఛీవ్​మెంట్ అవార్డుకు వుహాన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ వైరాలజీని నామినేట్​ చేసింది. 2021 ఏడాదికి గాను సంస్థకు ఈ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు చైనా మీడియా సంస్థ సీనా స్యూస్​లో కొన్ని కథనాలు వెలువడ్డాయి. కరోనా వైరస్​ను మొదటగా గుర్తించినందుకు, వైరస్​ నిర్మూలనకు కృషి చేసినందుకు గాను.. వుహాన్‌ ల్యాబ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సీనా న్యూస్​ తెలిపింది. కోవిడ్​-19 మూలాలు, ఎపిడమాలజీ, పాథోజెనిక్ మెకానిజంపై పరిశోధన చేయడంలో వుహాన్​ ల్యాబ్ ​ చేసిన కృషి అమోఘమని డ్రాగన్ దేశం కొనియాడింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు వూహాన్​ ల్యాబొరేటరీ వేసిన పునాది, సాంకేతిక అనితర సాధ్యమంటూ పొగడ్తలతో ముంచెత్తింది. కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించడానికి, వ్యాక్సిన్ల అభివృద్ధిలో వూహాన్​ ల్యాబరేటర్​ సైంటిస్టులు ఎంతో కృషి చేశారని రాసుకొచ్చింది. అంతేకాదు, చైనా "బాట్ ఉమన్"గా పేరొందిన వుహాన్ ల్యాబ్ అధిపతి షి జెంగ్లీని పొగడ్తలతో ముంచెత్తింది.

కరోనా మూలాలను గుర్తించడంలో, వైరస్ నుంచి జన్యువులను వేరుచేసి ఒక నమూనాను రూపొందించడానికి ఆమె చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. వుహాన్​ శాస్త్రవేత్తలు వైరస్​ జెంగ్లీపై "గెయిన్- ఆఫ్-ఫంక్షన్" (GOF) ప్రయోగాలు జరిపినట్లు పేర్కొంది. ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు వైరస్ బలాన్ని పెంచుతూ వాటి జన్యు మూలాలపై క్షుణ్నంగా అధ్యయనం చేశారని వెల్లడించింది.

* కరోనా చైనా సైంటిస్టుల సృష్టి కాదట..
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ ‘‘కరోనా నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు వుహాన్​ ల్యాబ్​ శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. వైరస్​ను తొలుత గుర్తించడంలో, వ్యాక్సిన్ల రూపకల్పనలో కీలకంగా పనిచేసిన సైంటిస్టులంతా నోబెల్ బహుమతిని పొందటానికి అర్హులే. కోవిడ్​–19 జన్యు శ్రేణిని మొదట చైనా శాస్త్రవేత్తలే గుర్తించారు. వైరస్​ను ఇక్కడ మొదట గుర్తించినంత మాత్రాన, వుహాన్ కరోనా వైరస్​కు మూలం కాదు. కానీ ఇక్కడి ల్యాబ్ నుంచే వైరస్​ లీకైనట్లు అంతర్జాతీయ మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం” అని వివరించారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: China, Corona, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు