రజినీకాంత్ ‘పేట్టా’ మూవీ నుంచి ‘మారన మాస్’ సాంగ్ రిలీజ్

ఒకవైపు 2.O మూవీ సక్సెస్‌ ఎంజాయ్ చేస్తూనే..మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన ‘పేట్ట’ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసే హడావుడిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన లుక్స్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి ‘మారన మాస్’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: December 3, 2018, 6:29 PM IST
రజినీకాంత్ ‘పేట్టా’ మూవీ నుంచి ‘మారన మాస్’ సాంగ్ రిలీజ్
‘పేట్టా’లో రజినీకాంత్
  • Share this:
రీసెంట్‌గా రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నటించిన ‘2.0’ మూవీతో పలకరించాడు. ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.400 కోట్లను కలెక్ట్ చేసింది.

ఒకవైపు 2.O మూవీ సక్సెస్‌ ఎంజాయ్ చేస్తూనే..మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన ‘పేట్ట’ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసే హడావుడిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన లుక్స్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

పేట్టాలో రజినీకాంత్


తాజాగా ఈ మూవీ నుంచి ‘మారన మాస్’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసారు. అనిరుథ్ స్వరపరిచిన పాటకు ఎస్పీ బాలు గాత్రం అందించారు. ఈ పాట రజినీ స్టైల్లో ఊరమాస్‌గా ఉంది. రిలీజైన తర్వాత థియేటర్స్‌లో ఈ పాట మారుమోగడం ఖాయం అనే చెప్పాలి.

‘పేట్టా’లో రజినీకాంత్ సరసన సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ మూవీని వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

ఇది కూడా చదవండి 

4 రోజుల్లో రూ.400 కోట్లు కలెక్ట్ చేసిన ‘2.O’ : దటీజ్ రజినీకాంత్


నందమూరి హీరోల అరుదైన రికార్డు
Published by: Kiran Kumar Thanjavur
First published: December 3, 2018, 6:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading