సింప్లిసిటీ, స్టైల్‌కు మారుపేరుగా సూపర్‌స్టార్.. పాఠ్యాంశంగా రజనీకాంత్ జీవిత చరిత్ర

Super Star Rajnikanth: గొప్ప వ్యక్తిత్వమున్న రజనీకాంత్ గురించి విద్యార్థులకు తెలిపేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రస్థానాన్ని ఐదో తరగతి పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చింది. స్వయంకృషితో ఎదిగిన ప్రముఖులు అనే పాఠంలో రజనీకాంత్ గురించి ప్రస్తావించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 10, 2019, 11:32 AM IST
సింప్లిసిటీ, స్టైల్‌కు మారుపేరుగా సూపర్‌స్టార్.. పాఠ్యాంశంగా రజనీకాంత్ జీవిత చరిత్ర
‘పేట్టా’లో రజినీకాంత్
  • Share this:
రజనీకాంత్.. ఈ పేరు వింటే దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ ఊగిపోతుంది. ఆయన స్టైల్ అన్నా, డైలాగ్స్ అన్నా ఆ క్రేజే వేరు. కార్పెంటర్‌, కండక్టర్‌ స్థాయి నుంచి తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా ఎదిగిన సూపర్‌స్టార్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కేవలం దక్షిణాదినే కాకుండా యావత్తు భారత చలనచిత్ర పరిశ్రమ ఆయనకు సెల్యూట్ చేస్తుంది. ఎందుకంటే.. ఆయన వ్యక్తిత్వమే కారణం అని చెప్పాలి. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన రజనీకాంత్ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు రజనీ ఆరాధ్య నటుడు. కోట్లు ఉన్నా, స్టార్‌డమ్ ఉన్నా పొగరు తలకు ఎక్కని గొప్ప వ్యక్తి. ఢాంబికాలు ప్రదర్శించకుండా, అతి సాధారణ జీవితాన్ని గడుపుతూ.. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారాయన.

అయితే, ఇంతటి గొప్ప వ్యక్తిత్వమున్న రజనీకాంత్ గురించి విద్యార్థులకు తెలిపేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రస్థానాన్ని ఐదో తరగతి పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చింది. స్వయంకృషితో ఎదిగిన ప్రముఖులు అనే పాఠంలో రజనీకాంత్ గురించి ప్రస్తావించారు. చార్లీ చాప్లిన్, స్టీవ్ జాబ్స్, జేకే రౌలింగ్, ఫ్రాంక్ ఓడియా, ఓప్రా విన్‌ఫ్రే సహా రజనీ గురించి పాఠ్యాంశంలో చేర్చారు.

5వ తరగతి పుస్తకంలో రజనీకాంత్ జీవిత చరిత్ర


తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సహా వివిధ భాషల్లో దాదాపు 160 సినిమాల్లో రజనీకాంత్ నటించారు. దర్బార్‌ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్శిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

First published: June 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు