Home /News /trending /

SUPER BLOOD WOLF MOON 2019 IN INDIA KNOW WHERE IT IS VISIBLE AND HOW TO WATCH

నేడు సంపూర్ణ "తోడేలు" చంద్ర గ్రహణం... ప్రత్యేకతలేంటి? తోడేలు కథేంటి?

బ్లడ్ మూన్

బ్లడ్ మూన్

Lunar Eclipse 2019 : మనం తెలుసుకోవాలే గానీ ఈ ప్రపంచంలో ఎన్నో వింతలూ, విడ్డూరాలు. సందర్భాన్ని బట్టీ మనం వాటి గురించి మాట్లాడుకుంటాం. తాజాగా సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

జనవరి 21న మన టైం ప్రకారం ఉదయం 9 గంటలకు చంద్రగ్రహణం మొదలవ్వబోతోంది. ఉదయం 10.11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణంగా మారి 62 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ చంద్ర గ్రహణాన్ని ఇంగ్లీష్‌లో ''సూపర్ బ్లడ్ ఉల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్'' అని పిలుస్తున్నారు. ఇందులో తోడేలు పదం ఎందుకు చేరిందన్నది ఆసక్తికరం. ప్రస్తుతం అమెరికాలో చలి ఎక్కువ. విపరీతంగా మంచు కురుస్తూ ఉంటుంది. అందువల్ల జంతువులకు ఆహారం దొరకదు. తోడేళ్లైతే... ఆహారం కోసం గ్రామాల శివార్లలోకి వచ్చి గట్టిగా అరుస్తాయి. అందువల్ల జనవరిలో కనిపించే చంద్రుణ్ని ఊల్ఫ్ మూన్ అని పిలుస్తారు. అందువల్ల ఇప్పుడు వచ్చే చంద్ర గ్రహణాన్ని తోడేలు చంద్రగ్రహణం అంటున్నారు.

బ్లడ్ మూన్ అని పిలవడానికి కూడా మరో కారణం ఉంది. సాధారణంగా సూర్య కిరణాల్లో రెడ్, ఆరెంజ్ కలర్స్ ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు... మిగతా రంగులు ఆగిపోయినా, ఆ రెండు రంగులూ మాత్రం చంద్రుడివైపు దూసుకెళ్తాయి. అందుకే ఆ సమయంలో చందమామ ఎరుపు రంగులో కనిపిస్తుంది. అందుకే దాన్ని బ్లడ్ మూన్ అంటున్నారు. ఈసారి వచ్చే చంద్రగ్రహణంలో చందమామ 7 శాతం పెద్దగా, 15 శాతం కాంతివంతంగా కనిపిస్తుంది. ఐతే... ఇది మన దేశంలో కనిపించదు. ఉత్తర, దక్షిణ అమెరికా, నార్త్ యూరప్, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది.

జులై 27న కూడా మరో చంద్రగ్రహణం రాబోతోంది. అది ఏకంగా 3 గంటల 55 నిమిషాల పాటు ఉంటుంది. అందులో 1.43 గంటల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ఐతే... చంద్రగ్రహణం ఏర్పడేటప్పుడు నర బలులు ఇవ్వడం, అలా చేస్తే అతీత శక్తులు వస్తాయనే మూఢ నమ్మకం కొన్ని దేశాల్లో ఉంది. ఇలాంటి చర్యలు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశోధనల్లో తేలింది.

ఇవి కూడా చదవండి 

First published:

Tags: Lunar Eclipse

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు