కేన్సర్‌పై సన్నీ లియోన్ పోరు.. ఆర్థిక సహాయం చేయాలని అర్థిస్తూ..

సన్నీ లియోన్ కేన్సర్‌పై పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ష్యాషన్ డిజైనర్ మహేకా మిర్‌పూరి నిర్వహిస్తున్న ఛారిటీ కార్యక్రమంలో ఈ హాట్ బ్యూటీ పాల్గొనబోతోందట.

news18-telugu
Updated: October 3, 2019, 9:42 AM IST
కేన్సర్‌పై సన్నీ లియోన్ పోరు.. ఆర్థిక సహాయం చేయాలని అర్థిస్తూ..
సన్నీ లియోన్
  • Share this:
ఓవైపు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు.. మరోవైపు సొంత ఫ్యాషన్ బ్రాండ్‌తో సన్నీ లియోన్ బిజీ బిజీగా గడిపేస్తోంది. వయాకామ్18 సమర్పిస్తున్న మోతీచూర్ చక్నాచూర్ సినిమాలో హాట్ అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ సినిమాలో ఓ సాంగ్‌లో నవాజుద్దీన్ సిద్దీఖీతో స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన సాంగ్ షూటింగ్ నిన్ననే పూర్తయ్యింది. అంతేకాదు.. కామసూత్రపై ఏక్తాకపూర్ తీస్తున్న వెబ్ సిరీస్‌లో మెరవనుందని సమాచారం. ఇందులో లీడ్ రోల్ తనే చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, సన్నీ లియోన్ కేన్సర్‌పై పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ష్యాషన్ డిజైనర్ మహేకా మిర్‌పూరి నిర్వహిస్తున్న ఛారిటీ కార్యక్రమంలో ఈ హాట్ బ్యూటీ పాల్గొనబోతోందట.

దీనిపై స్పందించిన సన్నీ లియోన్ ‘నా తండ్రి కేన్సర్‌తో చనిపోయారు. కేన్సర్ నిర్మూలనకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా. విరాళాల సేకరణకు నా వంతు కృషి చేస్తా. నా వల్ల ఒక్క వ్యక్తి సహాయం అందుకున్నా గొప్ప సంతోషం కలుగుతుంది. మనముందున్న మహమ్మారి వ్యాధితో చేస్తున్న యుద్ధంలో చిన్న గెలుపు సాధించినట్లే’ అని తెలిపిందీ బ్యూటీ.

First published: October 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>