Home /News /trending /

SUNKEN CARGO SHIP WITH 30 CREW MEMBERS OFF THE COAST OF IRAN SNR

Iran:సముద్రంలో మునిగిపోయిన కార్గో షిప్..అందులో ఏమున్నాయో ఎంత మంది మునిగారో తెలుసా

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Iran: ఇరాన్‌ సముద్రంలో కార్గొ నౌక మునిగిపోయింది. కార్లు ఇతర వస్తువులను ఇరాక్‌లోని ఉమ్‌క్రస్‌కు తీసుకెళ్తుండగా మునిగిపోయింది. నౌక నీటిలో మునిగిన సమయంలో 30మంది సిబ్బంది ఉండగా అందులో 15మందికిపైగా కాపాడారు.

ఇరాన్‌( Iran)సముద్రంలో మరో భారీ నౌక (Cargo ship)మునిగిపోయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ కార్గోషిప్ ఇరాన్‌ అస్సలుయెస్ (Iran Assaluyeh port)నౌకాశ్రయానికి సరిగ్గా 30మైళ్ల దూరంలో మునిగిపోయింది. నీళ్లలో మునిగిపోయిన సమయంలో అల్‌ సాల్మీ అనే నౌక(Al Salmy 6) లో 30మంది సిబ్బంది(30Crew members)ఉన్నారు. నౌకలో కార్లతో పాటు విలువైన సరుకులను ఇరాక్‌లోని ఉమ్‌క్రస్‌కు పెర్షియన్‌ గల్ఫ్‌ మీదుగా వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. నౌక సముద్రంలో మునిగిపోయిన విషయాన్ని సేలం అల్ మక్రానీ కార్గో కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్ కెప్టెన్ నిజార్ ఖద్దౌరా వెల్లడించారు. అల్ సాల్మీ 6 నౌకతో పాటు మునిగిపోయిన 30మందిలో 16 మంది సిబ్బందిని రక్షకులు రక్షించారు. వీళ్లలో మరో 11 మంది లైఫ్‌ రాఫ్ట్‌పైకి వెళ్లడంతో వారిలో ఒక వ్యక్తిని దగ్గర్లోని ట్యాంకర్ ద్వారా రక్షించబడ్డాడు. మరో ఇద్దరు సిబ్బంది నీళ్లలో మునిగిపోయినట్లుగా సేలం అల్‌ మక్రానీ కార్గో కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్ వెల్లడించారు. సముద్రంలో మునిగిపోయిన వారిని కూడా రక్షించేందుకు ఇరాన్ సెర్చర్లు ప్రయత్నిస్తున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
నౌక మునిగిపోవడానికి ప్రధాన కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడమే కారణమని తేల్చారు. షిప్‌లో ఉన్న సిబ్బంది అంతా లైఫ్‌ జాకెట్స్‌ వేసుకున్నప్పటికి బలమైన గాలులు, గల్ఫ్‌లో తుఫానుల కారణంగా అలలు, కెరటాలతో సముద్రం అల్లకల్లోలంగా మారడం వల్లే ఇలాంటి ప్రమాదం..అందువల్లే సముద్రంలో నౌక నీట మునగాల్సిన పరిస్థితి తలెత్తిందని ఇరాన్ సెమీ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది.

30మంది సిబ్బందితో మునిగిన నౌక..
ఇరాన్‌కి 30మైళ్ల దూరంలో సముద్రంలో మునిగిపోయిన ఓడలో సుడాన్, ఇండియా, పాకిస్థాన్, ఉగాండా, టాంజానియా, థియోపియా దేశస్థులు ఉన్నట్లుగా కార్గో కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్ కెప్టెన్ నిజార్ ఖద్దౌరా స్పష్టం చేశారు. సముద్రం మధ్యలో వాతావరణం అనుకూలంగా లేనప్పుడే సముద్రంలో పెట్రోలింగ్ చేస్తున్న అమెరికా నేవీకి చెందిన 5వ ఫ్లీట్ సహాయం కోసం ప్రయత్నించారు. సేలం అల్ మక్రానీ కార్గో కంపెనీ అభ్యర్థనపై యూఎస్‌ నేవీ బృందం స్పందించనట్లుగా తెలుస్తోంది.

సగం మందికిపైగా సేఫ్..
గతేడాది కూడా ఇరాన్‌ నేవీకి చెందిన అతిపెద్ద యుద్ధనౌక ఖర్గ్ కూడా సముద్రంలో మునిగిపోయింది. అగ్నిప్రమాదం కారణంగా నౌక పూర్గి నీళ్లలో మునిగిపోయినప్పటికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒమన్ గల్ఫ్‌లోని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 790 మైళ్ల దూరంలో ఉన్న ఇరాన్ ఓడరేవు జాస్క్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు టీవీ పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో నౌక లోపలున్న సిబ్బంది మొత్తం సురక్షితంగా బయటపడ్డారు. 679 అడుగుల పొడవైన ఈ నౌక మునిగిన ప్రాంతంలో తరచూ ఇరాన్, ఇజ్రాయెల్ నౌకలు దాడులకు గురవుతుండడంతో ‘ఖర్గ్’ షిప్ మునిగిపోవడంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఇరాన్‌ మునిగిపోయిన కార్గోషిప్ విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి.
Published by:Siva Nanduri
First published:

Tags: Iran, Ship

తదుపరి వార్తలు