Home /News /trending /

SUBLIME SERENE BIRDS DANCE IN BEACH THIS SUPER VIDEO SHAKES INTERNET WATCH HERE SRD

Viral Video : వావ్‌.. వాటే వీడియో.. ఇలాంటి విన్యాసాలు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్...

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : వింతలు-విశేషాలకు సోషల్ మీడియా నిలయం. ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా జంతువుల, పక్షుల వీడియోలు ఆకట్టుకుంటాయ్.

    వింతలు-విశేషాలకు సోషల్ మీడియా నిలయం. ప్రపంచం నలమూలల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా జంతువుల, పక్షుల వీడియోలు ఆకట్టుకుంటాయ్. జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయ్. అలాంటివి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనప్పుడు వాటిని చూసి థ్రిల్ అవుతాం. కొంత మంది సమయం దొరకని వారు సోషల్ మీడియాలో జంతువుల సరదాను చూసి తమ సమయాన్ని గడుపుతారు. జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్ కావడానికి కారణం ఇదే. వాస్తవానికి, చాలా అరుదైన దృశ్యాలు అడవిలో కనిపిస్తాయి. అవి చూస్తే మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. అలాంటి కోవకి చెందినదే ప్రస్తుతం మనం చర్చించుకునే వీడియో. సాధార‌ణంగా ఎవ‌రైనా బీచ్‌కు ఎందుకు వెళ్తారు.. అక్క‌డ స‌ముద్రాన్ని చూసి.. ఎంజాయ్ చేయ‌డానికే క‌దా. కాసేపు స‌ముద్రాన్ని చూస్తూ ప్ర‌శాంతంగా ఉండేందుకే క‌దా. అయితే.. మ‌నుషులేనా.. మాకేం త‌క్కువ‌.. మేం కూడా ఎంజాయ్ చేస్తాం.. అన్న‌ట్టుగా.. ఓ ప‌క్షుల గుంపు స‌ముద్ర తీర ప్రాంతంలో విన్యాసాలు చేశాయి. క్ష‌ణాల్లో ర‌క‌ర‌కాలుగా మారుతూ.. అవి చేసిన విన్యాసాలు.. అక్క‌డి ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

    ఇది ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కానీ.. ఈ వీడియోను  ఐపీఎస్ ఆఫీస‌ర్ (IPS Officer) రూపిన్ శ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. నెటిజ‌న్లు కూడా ఆ వీడియోకి ఫిదా అవుతున్నారు. పక్షుల విన్యాసాల్ని చూసి వావ్ అంటున్నారు. ఈ వీడియోను చూసి మమ్మలి మేం మర్చిపోతున్నామంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.


    ఇలాంటి మరో వీడియోలో ఓ అష్టభుజి (octopus) కలర్స్ మార్చుకుంటోంది. ఇది మాత్రం నిజంగానే రంగులు మార్చుకుంటోంది. యాక్చువల్లీ అది ఓ చోట అలా ఉండి నిద్రపోతోంది. ఏం కలలు కంటుందో గానీ... దాని ఒంటిపై రంగులు మాత్రం మారిపోతున్నాయి. మొదట నాచు రంగులో ఉండి... తర్వాత వైట్ కలర్‌లోకి మారింది. ఆ తర్వాత మచ్చలున్నట్లుగా మార్చుకుంది. చివరకు ముళ్లు ఉన్నట్లుగా త్రీడీ కలర్స్‌లో మార్చుకుంది.


    ఇదంతా ఓ డైవర్... ముద్రంలో షూట్ చేశారు.ఈ వీడియోని ట్విట్టర్‌లో బ్యూటెంజెబీడెన్ (Buitengebieden) అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఆక్టోపస్ నిద్రపోతూ కలర్స్ మార్చుకోవడం నెటిజన్లకు బాగా నచ్చుతోంది. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఇలాంటిది ఇదివరకు ఎప్పుడూ చూడలేదు అంటున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Birds, Trending videos, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు