Home /News /trending /

STUFF OF NIGHTMARES THOUSANDS OF SCORPIONS CRAWLING INSIDE ABANDONED HOUSE LEAVES INTERNET HORRIFIED PAH

Viral video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. షాకింగ్ తో నోరెళ్లబెడుతున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే..

కుప్పలుగా పాకుతున్న తేళ్లు

కుప్పలుగా పాకుతున్న తేళ్లు

Scorpions: గదిలో వేల సంఖ్యలో తేళ్లు ఒకదాని మీద మరోకటి పాకుతున్నాయి. వీటిని చూడటానికి కూడా ఎంతో భయంకరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో ప్రతి రోజు వేలల్లో వీడియోలు (Social media)  వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటాయి. జంతువులకు చెందిన అనేక వీడియోలు వైరల్  (Viral videos) అవుతున్నాయి. కొన్ని రకాల వెరైటీ వీడియోలను చూడటానికి నెటిజన్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

పూర్తి వివరాలు... ఒక గదిలో తేళ్లు కుప్పలుగా పడిఉన్నాయి. అవి ఒకదాని మీద మరోకటి పాకుతున్నాయి. అవి ఎర్రగా ఉన్నాయి. ఇలాంటి తేళ్లు (Scorpions)  బ్రెజిల్ లో ఎక్కువగా కన్పిస్తాయని నెటిజన్ లు కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా తేళ్లు.. సంభోగం జరపవు. ఇవి లైంగిక చర్య జరపకుండా పిల్లలను కనగలవు. ఈ విధంగా తమ సంఖ్యను రెట్టింపు చేసుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో సుమారు.. 2000ల వరకు తేళ్ల జాతులు ఉన్నట్లు అంచనా.

వీటిలో కేవలం 30 నుంచి 40 జాతులు మాత్రమే అత్యంత భయంకరమైనవిగా తెలుస్తుంది. మిగతా తేళ్ళు కుడితే ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కల్గదు. అయితే, ప్రపంచంలో డెత్ స్టాకర్ స్కార్పియన్ అత్యంత విషపూరితమైనదిగా భావిస్తారు. దీని తోకల అత్యంత విషం ఉంటుంది. ఇది కాటు వేస్తే.. నిముషాల్లో మనిషి మరణిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

పాములు కుప్పలుగా ఒక చెట్టుకు వేలాడుతున్న వీడియో గతంలో వైరల్ గా మారింది.

సాధారణంగా పాములంటే (snakes)  చాలా మంది భయంతో వణికిపోతుంటారు. అసలు పాము పేరేత్తడానికి కూడా ధైర్యం చేయరు. పొరపాటున పాము కనిపిస్తే.. దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాహాసం చేయరు. సాధారణంగా పాములు అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. కొన్ని సార్లు ఆహారం కోసం, ఆవాసం కోసం దారితప్పి మనుషుల ఆవాసాలలోకి వస్తుంటాయి. అప్పుడు మనుషుల కంటపడతాయి. ఈ క్రమంలో దాడులు చేస్తుంటాయి. సాధారణంగా పాములకు చెందిన రకరకాలు వీడియోలు ఇప్పటికే వైరల్ (Viral video) అయ్యాయి. ప్రస్తుతం మరో వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

పూర్తి వివరాలు.. ఇక్కడ వీడియోలో ఒక చెట్టుకు పాములు కుప్పలుగా వేలాడుతూ ఉన్నాయి. అవి ఒక దాని మీద పాకుతూ.. చూడటానికి భయకంగా ఉన్నాయి. ఒకదానిపై మరోకటి బుసలు కొట్టుకుంటూ దాడులు చేసుకుంటున్నాయి. పైకి కిందకు..పాకుతున్నాయి. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Scorpio, Viral Video

తదుపరి వార్తలు