ఆ బడికి వెళ్లాలంటే బస్సు టాప్ ఎక్కాల్సిందే... విద్యార్థులకు ఎంత కష్టం...

Andhra Pradesh : వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత విద్య సహా విద్యార్థులకు మేలైన కొన్ని నిర్ణయాలు తీసుకుంది. కానీ... అమల్లోకి వచ్చేసరికి ఏ ప్రభుత్వమైనా పూర్తి స్థాయిలో అమలు చెయ్యలేకపోతోంది. మరి ఆ విద్యార్థులకు ఏ కష్టం వచ్చిందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 26, 2019, 11:16 AM IST
ఆ బడికి వెళ్లాలంటే బస్సు టాప్ ఎక్కాల్సిందే... విద్యార్థులకు ఎంత కష్టం...
స్కూల్‌కి వెళ్లాలంటే విద్యార్థులకు అవస్థలు తప్పవు.
  • Share this:
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని శెట్టూరు మండలం అయ్యగార్లపల్లిలో స్కూల్ పిల్లల దుస్థితి ఇది. ఇక్కడి వందల మంది విద్యార్థులు... చదువుకోవాలంటే శెట్టూరుకు వెళ్ళాలి. అలా వెళ్లాలన్నా రావాలన్నా బస్సు సౌకర్యాలు లేక ఇలా రోజు బస్సు టాపుపై ఎక్కి... పిల్లలు ప్రయాణించాల్సి వస్తోంది. బస్సులో ఉంటేనే రోడ్లపై కుదుపులకు అటూ ఇటూ పడిపోతూ ఉంటాం. అలాంటిది బస్సుపైన ప్రయాణం అంటే ఎంత ప్రమాదకరమో మనం ఊహించవచ్చు. అందులోనూ వాళ్లంతా పిల్లలు. పొరపాటున జారి పడితే ఏంటి పరిస్థితి? టెక్నాలజీతో దూసుకుపోతున్న ఈ రోజుల్లో చదువుకోవడానికి ఇంత కష్టపడాల్సిన దుస్థితి ఎందుకు? వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదా?

స్కూల్‌కి వెళ్లాలంటే విద్యార్థులకు అవస్థలు తప్పవు.


ఇంతకు ముందు ప్రభుత్వం ఇక్కడ ఆరు, ఏడు తరగతుల్ని రద్దు చేసింది. దాంతో పిల్లలు అవస్థలు పడుతున్నారు. తరగతులు రద్దైతే చేశారు గానీ... పక్క గ్రామాలకి పిల్లలు ఎలా వెళతారు అనే కానీస జ్ఞానం కూడా లేకుండా చేశారు. ఇలా బస్ టాపుపై ప్రయాణం చేసేటప్పుడు కింద పడితే ఎవరు బాధ్యులు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం, నాయకులు గుర్తించి కొత్త బస్సు సర్వీసులు నడపాలనీ, ఉన్న సర్వీసులు వేళకు... పిల్లలకు అనుకూల టైంకి వచ్చేటట్టు చూడాలని ప్రజలు కోరుతున్నారు.First published: July 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు