Home /News /trending /

STUDENT DETAINED AFTER KISSING VIDEO GOES VIRAL IN KARNATAKA PVN

Students Kissing : అపార్ట్ మెంట్ లో కాలేజీ విద్యార్థుల ముద్దుల పోటీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Students Kissing :కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని మంగళూరులో ఓ ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్ధుల జంట ఓ అపార్ట్‌మెంట్‌లో ముద్దుల్లో(Kissing) మునిగిపోయారు. వారిద్దరూ ముద్దుల్లో మునిగిపోయిన సమయంలో కాలేజీ యూనిఫామ్ లోనే..మెడలో ఐడీ కార్టులు ధరించి ఉన్నారు.

ఇంకా చదవండి ...
Students Kissing :కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని మంగళూరులో ఓ ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్ధుల జంట(Students) ఓ అపార్ట్‌మెంట్‌లో ముద్దుల్లో(Kissing) మునిగిపోయారు. వారిద్దరూ ముద్దుల్లో మునిగిపోయిన సమయంలో కాలేజీ యూనిఫామ్ లోనే..మెడలో ఐడీ కార్టులు ధరించి ఉన్నారు. విద్యార్థుల జంట ముద్దుల్లో మునిగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అయింది. వారు ముద్దులు పెట్టుకుంటూ తన్మయత్వంలో మునిగిపోగా..చుట్టూ ఉన్న వారి స్నేహితులు కేకలు వేస్తూ వారిని మరింతగా ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా ఆ వీడియోలో కనిపించింది. ప్రముఖ కళాశాలకు చెందిన ఓ యువకుడు, ఓ బాలిక ఇద్దరూ ఇక్కడి ఓ ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌లో ముద్దుల్లో మునిగిపోయిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నగరంలోని కళాశాల అధికారులు, తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది. విద్యార్థినీ విద్యార్థిముద్దుపెట్టుకుంటున్న వీడియో వైరల్‌గా మారిన తర్వాత పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. వీడియో తీసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అయితే అది ముద్దుల పోటీ అని పోలీసులు తెలిపారు. ఈ వీడియో ఇప్పటిది కాదని, ఆరు నెలల క్రితం నాటిదని మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. వారం రోజుల క్రితం ఈ వీడియోను యువకుడు వాట్సాప్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యాజమాన్యం వారిని హెచ్చరించి కాలేజీ నుంచి తొలగించింది. అయితే, ఈ ముద్దుల కాంపిటిషన్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, కాలేజీ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని కమిషనర్ తెలిపారు. కిస్సింగ్ కాంపిటిషన్ సందర్భంగా విద్యార్థులు ఏమైనా డ్రగ్స్ ఉపయోగించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Nurse Dress : హాస్పిటల్ డ్రెస్ వేసుకున్న ఈ నర్సుపై ట్రోలింగ్..పేషెంట్స్ కూడా

మరోవైపు,కులం కాటుకు ఓ మైనర్ బాలిక గాయపడిన వార్త తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించింది. ముదిగొండ మండలం గంధసిరికి చెందిన ఉప్పలరాజుకు ఖమ్మం పట్టణం పాకబండబజారుకు చెందిన బొజ్జమ్మతో 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది. నలుగురు సంతానం ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. భార్యభర్తల మధ్య గొడవలు ఉండటంతో పరస్పర అంగీకారంతో విడిపోవడానికి కోర్టులో డైవర్స్‌ పిటిషన్‌ పెట్టుకున్నారు.భార్యభర్తలు కోర్టు ద్వారా విడాకులు పొందాలని చూడటాన్ని కుల పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. దానికి ప్రతీకారంగా ఉప్పలరాజుకు కనీస సమాచారం ఇవ్వకుండానే, అతని భార్య సంరక్షణలో ఉన్న పదిహేనేళ్ల కుమార్తెకు గత నెల 26వ తేదీన బలవంతంగా పెళ్లి జరిపించారు. ఈ విషయంలో బాలిక అప్పుడే తనకు పెళ్లి వద్దని తనకు చదువుకోవాలని ఉందంటూ చెప్పినప్పటికి వినిపించుకోలేదు. కనీసం తన తండ్రికి కబురు చేయమని ఏడ్చినా పట్టించుకోలేదు. ఆమె మాటకు విలువ ఇవ్వలేదు. బలవంతంగా పసుపు తాడు పేరుతో మైనర్ బాలిక మెడలో ఓ పలుపుతాడు వేయించారు. పెళ్లి జరిగింది కాబట్టి పెళ్లి ఆమె భర్తగా ఉన్న నర్సింహ అనే వ్యక్తి మైనర్ బాలికపై నిత్యం అత్యాచారం చేస్తూ వచ్చాడు.విషయం బాలిక తండ్రికి వేరే వాళ్ల ద్వారా తెలియడంతో మండిపడ్డాడు. కులపెద్దల తీర్పును కాదన్నందుకు ఇలా చేస్తారా అని నిలదీశాడు. విడాకుల కోసం ఎదురుచూస్తున్న భార్యను సైతం ఈవిషయంలో మందలించాడు. కులం కట్టుబాట్లు, కుల పెద్దల నిర్ణయం పేరుతో చేసిన తప్పుడు పనిపై తీవ్రంగా మండిపడ్డాడు అప్పలరాజు. తనపై ఉన్న కోపంతో అభం, శుభం తెలియని తన కుమార్తెను బలి చేశారని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తన కూతురుకు జరిగిన అన్యాయంపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మంచిగా చదువుకుంటున్న చిన్నారికి బలవంతంగా పెళ్లిచేసి వేధిస్తున్నారని, తనను కలవనీయకుండా కుమార్తెను ఎక్కడో రహస్య ప్రదేశంలో ఉంచారని ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఛైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారుల ద్వారా విచారణ జరిపారు. జగిత్యాలలో ఉన్న చిన్నారి పెళ్లికూతురును కూడా విచారించారు. ఆమె వయసును, ఆమె అభ్యంతరాలను నమోదు చేసుకున్న అధికారులు చిన్నారులపై అత్యాచారాల నిరోధక చట్టంతో పాటు ఛైల్డ్‌ హరాస్‌మెంట్‌ కేసును నమోదు చేశారు. బాల్య వివాహాన్ని ప్రోత్సహించినందుకు, మైనర్‌ బాలికపై అత్యాచారం, కిడ్నాప్‌కు పాల్పడ్డారంటూ పలు సెక్షన్ల కింద పద్దెనిమిది మంది కుల పెద్దలపై కూడా కేసు నమోదు చేశారు. కుల పెద్దల అకృత్యానికి బలైపోయిన చిన్నారిని ఛైల్డ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Karnataka, Kissing day, Viral Video

తదుపరి వార్తలు