ప్రధాని మోదీ యోగా పాఠాలు... వైరల్ వీడియో...

PM Modi Yoga : యోగా తప్పకచేసే ప్రధాని మోదీ... ఓ ముఖ్యమైన ఆసనం గురించి ట్విట్టర్‌లో వీడియో ద్వారా వివరించారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 7, 2019, 7:13 AM IST
ప్రధాని మోదీ యోగా పాఠాలు... వైరల్ వీడియో...
యోగా వీడియోలో ఓ దృశ్యం (Image : Twitter)
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ యోగా గురు అయిపోయారు. యానిమేషన్ రూపంలో తానే కనిపిస్తున్న ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అందులో అత్యంత కీలకమైన తాడాసనం ఎలా వెయ్యాలో నేర్పించారు. తాడాసనం వెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆ వీడియోలో వివరించారు. ఇతర ఆసనాలు సులభంగా వేసేందుకు తాడాసనం వీలు కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఇంతకుముందు త్రికోణ ఆసనం వేస్తున్న బొమ్మ వీడియోను కూడా బుధవారం ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. అందరూ యోగా చేయాలని, ఇతరులూ యోగా చేసేలా స్ఫూర్తి కలిగించాలని పిలుపునిచ్చారు. ఈనెల 21న ప్రపంచ యోగా దినం రాబోతోంది. అందుకే మోదీ సరికొత్తగా ఆలోచించి, యోగాపై అందరికీ ఆసక్తి
కలిగేలా ఇలా వీడియోలు విడుదల చేస్తున్నట్లు తెలిసింది.


ప్రస్తుతం తాజా వీడియో నెట్‌లో వైరల్ అయ్యింది. ఇప్పటికే దాన్ని 37వేల మంది లైక్ చెయ్యగా... 7 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. 2014లో దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ యోగాకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన చొరవతో ఐక్యరాజ్యసమితి ఏకంగా ప్రపంచ యోగా దినాన్ని ప్రకటించింది. తాజాగా రెండోసారి ప్రధాని అయిన మోదీ... యోగాకు మరింత గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మోదీ యానిమేషన్ యోగా వీడియోల కోసం ప్రత్యేక ఐటీ అధికారుల టీమ్ పనిచేస్తోంది.తాజా వీడియోలో ఉన్న తడాసనాన్ని మోదీ ప్రతిరోజూ చేస్తారు. ఇది చాలా ఈజీగా ఉందనీ, తామూ చేస్తున్నామని నెటిజన్లు చెబుతున్నారు.
First published: June 7, 2019, 7:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading