హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

పులి లాంటి కుక్క.. అలా మార్చిన వ్యక్తిని పట్టిస్తే అద్భుతమైన గిఫ్ట్

పులి లాంటి కుక్క.. అలా మార్చిన వ్యక్తిని పట్టిస్తే అద్భుతమైన గిఫ్ట్

పులి లాంటి కుక్క.. అలా మార్చిన వ్యక్తిని పట్టిస్తే అద్భుతమైన గిఫ్ట్

పులి లాంటి కుక్క.. అలా మార్చిన వ్యక్తిని పట్టిస్తే అద్భుతమైన గిఫ్ట్

కుక్కకు హానికారక రసాయనాలతో పెయింటింగ్ వేసిన అతడిని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

వీధుల్లో ఓ పులి తిరుగుతోంది. దాని చూసి జనాలంతా పరుగులు పెడుతున్నారు. కాస్త తీక్షణంగా చూస్తే అది పులికాదు. వీధి కుక్కే. అలాగని పుట్టుకతోనే దానికి ఆ రంగు రాలేదు. ఎవరో కావాలనే రంగులు వేసి అలా మార్చారు. నారింజ, నలుపు చారలు వేసి అచ్చం పులిలా మార్చేశారు. ఎవరో సరదా కోసం ఈ పనిచేశారు. అతడు సరదా కోసమే చేసి ఉండొచ్చు.. కానీ ఇప్పుడీ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. మలేషియాలో జరిగిన ఈ ఘటనపై జంతు హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పెర్సాటోన్ హైవాన్ మలేసియా అనే జంతు హక్కుల సంస్థ.. ఆ వ్యక్తిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కుక్కను హింసించి పులిలా రంగులు వేసిన అతడిని పట్టించాలని ప్రకటన విడుదల చేసింది. అలా పట్టించిన వారిని అద్భుతమైన బహుమతి కూడా ఇస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.

ఈ జంతు హక్కుల సంఘం ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టును ఇప్పటి వరకు 3వేల మందికి పైగా షేర్ చేశారు. 6వేల మందికి పైగా వీక్షించారు. అవును..కుక్కకు హానికారక రసాయనాలతో పెయింటింగ్ వేసిన అతడిని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Dog, Malaysia

ఉత్తమ కథలు