ప్రాణాల మీదకు వస్తే ఎంతటి బలహీనమైన ప్రాణమైన ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తుంది. ఒక్కోసారి పిల్లి కూడా పులి అవుతుందంటారు. అయితే చాలాసార్లు బలమైన జీవే గెలిచినా.. కొన్నిసార్లు అద్భుతమైన పోరాటంతో బలహీనమైన జీవులు విజయం సాధిస్తాయి. అలాంటి ఘటనే తాజాగా జరిగింది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఏకంగా సింహంతో ఓ వీధి కుక్క(శునకం) పోరాడింది. తన కన్నా ఎంతో శక్తిమంతమైన, పెద్దదైన మృగాన్ని భయపెట్టింది. గట్టిగా అరుస్తూ సింహాన్ని వెంబడించింది. కుక్క ధైర్యానికి, పోరాటానికి బెంబేలెత్తిపోయిన సింహం ఏం చేయలేక వెనుదిరిగింది.
గుజరాత్లోని ససన్ అడవిలో ఈ అరుదైన విషయం జరిగింది. అక్కడి పర్యాటకులు ఈ శునకం, సింహం పోరాటాన్ని వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్గా మారింది.
ఒక నిమిషం 44 సెకన్ల పాటు ఈ వీడియో ఉంది. ముందుగా ఓ వైపు నుంచి కుక్కపై సింహం దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా తేరుకున్న శునకం.. గట్టిగా అరిచింది. మృగంపై తిరగబడింది. ఆ తర్వాత ఎదురుగాడికి దిగి సింహానికి ఒక్కటిచ్చింది. దీంతో లయన్ వెనకడుగు వేసింది. మళ్లీ దాడి చేసేందుకు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral Video