పెద్దపల్లి జిల్లాలో వింత చేప... చూసేందుకు తరలివచ్చిన ప్రజలు... వైరల్ వీడియో...

పెద్దపల్లి జిల్లాలో వింత చేప... చూసేందుకు తరలివచ్చిన ప్రజలు

ఎక్వేరియంలలో మన వేలంత ఉంటాయి గోల్డ్ ఫిష్ లు అలాంటిది ఆ చేప ఏకంగా చెయ్యంత ఉంది.

 • Share this:
  తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి కదా... వాగులూ వంకలూ ఉప్పొంగుతున్నాయి కదా... అలాగే... పెద్దపల్లి జిల్లాలో చెరువులు... నిండిపోయాయి. అలాంటి చోట... ఎలిగేడు మండలం దూలికట్టలో జాలర్లు... రోజూ లాగే చేపల వేటకు వెళ్లారు. ఈ వర్షంలో చేపలు వల్లో పడతాయో లేదో... ఆ దేవుడే దిక్కు అనుకుంటూ... వల వేశారు. కాసేపటికి... కొన్ని చేపలు వల్లో పడ్డాయి. వాటిలో ఇదుగో... ఈ ఫిష్ మాత్రం అందర్నీ ఆకర్షించింది. అసలు ఈ చేప రకం ఇదివరకు ఎప్పుడూ చూడలేదంటున్నారు. ఇది ఏ చేపో కూడా తమకు తెలియదంటున్నారు.

  viral news, viral tweet, viral videos, trending tweet, trending videos, trending news, వైరల్ న్యూస్, వైరల్ ట్వీట్, వైరల్ వీడియోస్, ట్రెండింగ్ ట్వీట్, ట్రెండింగ్ వీడియోస్,
  పెద్దపల్లి జిల్లాలో వింత చేప... చూసేందుకు తరలివచ్చిన ప్రజలు


  ఈ చేప బంగారు వర్ణంలో ఉండటంతో... వింత చేప అంటూ ప్రజలు దీన్ని చూసేందుకు వస్తున్నారు. ఎవరూ కూడా ఇది ఏ జాతి చేపో చెప్పలేకపోతున్నారు.

  పెద్దపల్లి జిల్లాలో వింత చేప... చూసేందుకు తరలివచ్చిన ప్రజలు


  జనరల్ గా ఇలాంటి చేపలు ఎక్వేరియంలో చిన్నగా ఉంటాయి. వాటిని మనం గోల్డ్ ఫిష్ లు అంటాం. ఇది చూడటానికి అలాగే ఉంది. కానీ ఇది చాలా పెద్దగా ఉంది. అందుకే ఇది అందర్నీ ఆకర్షిస్తోంది.

  మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అరుదైన, కొత్త కొత్త చేపలు ఈ మధ్య రెండేళ్లుగా బాగా కనిపిస్తున్నాయి. అరుదైన చేపలు లభించడం మంచి విషయమే.
  Published by:Krishna Kumar N
  First published: