హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Bengaluru: లాక్‌డౌన్ టైంలో బయటేంటని బైక్ ఆపారు.. అతని ఆన్సర్‌తో అవాక్కయిన పోలీసులు

Bengaluru: లాక్‌డౌన్ టైంలో బయటేంటని బైక్ ఆపారు.. అతని ఆన్సర్‌తో అవాక్కయిన పోలీసులు

పోలీసులు అడగ్గా వెడ్డింగ్ కార్డ్ చూపుతున్న యువకుడి బంధువు

పోలీసులు అడగ్గా వెడ్డింగ్ కార్డ్ చూపుతున్న యువకుడి బంధువు

బెంగళూరులో ఆదివారం లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. బైక్‌పై మరో వ్యక్తి కూడా కూర్చుని ఉన్నాడు. లాక్‌డౌన్ అమల్లో ఉండగా.. ఇద్దరూ జాలీగా ఎక్కడకు వెళుతున్నారని బైక్‌ నడుపుతున్న ఆ యువకుడిని...

ఇంకా చదవండి ...

  బెంగళూరు: కర్ణాటకలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో బెంగళూరులో ఆదివారం వరకూ వీకెండ్ లాక్‌డౌన్ అమలైంది. తాజాగా.. కర్ణాటకలో రానున్న 14 రోజుల పాటు కోవిడ్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని సీఎం యడియూరప్ప ప్రకటించారు. ఏప్రిల్ 27 రాత్రి 9 గంటల నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని సీఎం తెలిపారు. అయితే.. నిన్నమొన్నటివరకూ అమల్లో ఉన్న వీకెండ్ లాక్‌డౌన్‌ సమయంలో డ్యూటీల్లో ఉన్న పోలీసులకు చిత్రవిచిత్ర పరిణామాలు ఎదురయ్యాయి. బెంగళూరులో వీకెండ్ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసే క్రమంలో వాహనాలేవీ రోడ్డెక్కకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కొందరు బైకర్లు పోలీసులకు రకరకాల కారణాలు చెప్పి రోడ్డుపై రయ్‌మనుకుంటూ వెళ్లారు. బెంగళూరులో ఆదివారం లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. బైక్‌పై మరో వ్యక్తి కూడా కూర్చుని ఉన్నాడు. లాక్‌డౌన్ అమల్లో ఉండగా.. ఇద్దరూ జాలీగా ఎక్కడకు వెళుతున్నారని బైక్‌ నడుపుతున్న ఆ యువకుడిని పోలీసులు ప్రశ్నించారు. అయితే.. మరికొద్దిసేపట్లో తన పెళ్లి ఉందని, పెళ్లి కొడుకును తానేనని.. కోవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నానని యువకుడు చెప్పడంతో అవాక్కవడం పోలీసుల వంతయింది. ముహూర్తానికి వేళ అవుతోందని, తనను పంపించాల్సిందిగా ఆ యువకుడు పోలీసులను కోరాడు. పెళ్లి దుస్తుల్లో కూడా లేకపోవడంతో ఫ్రూఫ్ ఏంటని పోలీసులు అడిగారు. దీంతో.. వెనక కూర్చున్న వ్యక్తి వెంటనే పెళ్లి కార్డు తీసి చూపించాడు. అప్పుడు పోలీసులు వారు వెళ్లేందుకు అనుమతించారు.

  శివమొగ్గలోని మెగ్గాన్ జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్ష చేయించుకున్న ఓ యువకుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హోం క్వారంటైన్‌లో ఉండాలని, 14 రోజులు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించిన వైద్యులు.. అవసరమైన మందులు రాసిచ్చారు. ఆసుపత్రి నుంచి ఆ యువకుడు బైక్‌పై ఇంటికి వెళుతుండగా పోలీసులు ఆపారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. అందుకే సెల్ఫ్ ఐసోలేషన్ పాటించేందుకు ఇంటికి వెళుతున్నానని ఆ యువకుడు చెప్పడంతో పోలీసులకు చెమటలు పట్టాయి.

  కరోనా పాజిటివ్‌గా తేలితే ఇలా బయట తిరుగుతున్నావేంటని ఆ యువకుడిని పోలీసులు అడగ్గా.. అంబులెన్స్ కోసం ఎదురుచూసినా ఒక్క అంబులెన్స్ కూడా రాకపోవడంతో చివరకు చేసేదేమీ లేక బైక్‌పై వెళుతున్నానని ఆ యువకుడు సమాధానమిచ్చాడు. దీంతో.. ఆ యువకుడిని పంపించిన పోలీసులు.. ఇంటికి వెళ్లాక ఫోన్ చేసి సమాచారమివ్వాలని చెప్పారు. ఇలా లాక్‌డౌన్ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులకు వింత అనుభవాలు ఎదురవుతుండటం గమనార్హం.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bengaluru, Corona, Lockdown

  ఉత్తమ కథలు